YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిన్నమ్మ సైలెంట్ అయిపోయారే

చిన్నమ్మ సైలెంట్ అయిపోయారే

విజయవాడ, అక్టోబరు 12,
భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్న పురంద్రీశ్వరి గత కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. దాదాపు ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దాదాపు ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు లెక్కే. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న పురంద్రీశ్వరి సోము వీర్రాజు పార్టీ బాధ్యతలు స్వీకరించాక కొంత స్లో అయ్యారు. దీనికి కారణాలు బయటపడకపోయినా పురంద్రీశ్వరి పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లే తెలుస్తోంది.పురంద్రేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా రెండు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. అయితే తొలుత కాంగ్రెస్ లో చేరిన పురంద్రీశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కాంగ్రెస్ లో ఆమెకు తగిన గౌరవం లభించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పురంద్రీశ్వరి బీజేపీలో చేరారు. బీజేపీలో పార్టీ పరంగా పదవులు ఇచ్చినప్పటికీ తనను కేంద్రంలోని పెద్దలు గుర్తించడం లేదన్న అభిప్రాయంలో పురంద్రీశ్వరి ఉన్నారు.రెండోసారి అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత పురంద్రీశ్వరి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తన భర్త వైసీపీలో చేరి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమె మాత్రం బీజేపీ వెంటే నడిచారు. రెండోసారి బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఏపీ నుంచి తనకే ప్రాధాన్యత లభిస్తుందని భావించారు. కనీసం రాజ్యసభకు కూడా ఎంపిక చేయకపోవడంతో పురంద్రీశ్వరి గుర్రుగా ఉన్నారు.అందుకే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి మరొక కారణం ఉందంటున్నారు. సోము వీర్రాజు కొందరినే దగ్గరకు తీస్తున్నారని, ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కనీసం కార్యక్రమాల సమాచారం కూడా అందరికీ చేరడం లేదు. ఈకారణంగానే పురంద్రీశ్వరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.

Related Posts