YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నామమాత్రంగా గొర్రెల పంపిణీ

నామమాత్రంగా గొర్రెల పంపిణీ

న‌ల్గొండ‌, అక్టోబ‌రు 12, రెండో విడత గొర్రెల పంపిణీ ఏండ్లు గడుస్తున్నా చేయడంలేదు. డీడీలు కట్టిన గొర్రెల పెంపకందారులు గొర్రెలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొల్ల, కురుమలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి 2017 సంవత్సరంలో జూన్‌ 20న కొండపాక గ్రామంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. రెండేండ్లలో పూర్తి చేస్తామని చెప్పడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి. మొదటి విడత, రెండో విడత అంటూ చెప్పి మొదటి విడతలో పంపిణీ చేసి, రెండో విడత వారికి మొండిచేయి చూపడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలో మొత్తం గొల్ల, కురుమల సుమారు 29.5 లక్షల జనాభాతో ఏడు శాతం ఉన్నారు. వీరిలో 7.15 లక్షల కుటుంబాలు కేవలం గొర్రెల పోషణ ద్వారానే జీవిస్తున్నాయని చెబుతూ గొల్ల, కురుమలను కోటీశ్వరులను చేస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పి ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభానికి ముందే రాష్ట్రంలో గొర్రెలు 1.58 కోట్లు ఉండగా, మేకలు 46.75 లక్షల సంపద ఉండేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం 1.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగేది.ఇక్కడ మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు సుమారు 400 నుంచి 600 గొర్రెలను తీసుకొచ్చి వినియోగించేవారు. ఈ లోటును తీర్చడానికి రాష్ట్రాన్ని అభివృచేసేందుకు గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివ ద్ధి చేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 75 శాతం  సబ్సిడీతో 7.29 లక్షల మందికి 1.53 కోట్ల గొర్రెల పంపిణీ చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జాతీయ సహకార అభివృద్ధి సమాఖ్య వద్ద రాష్ట్ర ప్రభుత్వం 3.75 వేల కోట్ల రుణం తీసుకుంది.పంపిణీ చేసే గొర్రెల అన్నింటికీ దాన మెడికల్‌ కిట్లు మేతకోసం సబ్సిడీపై గడ్డి విత్తనాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించారు. పథకంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందని ప్రకటించడంతో గొల్ల కురుమలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి గొల్ల కురుమలు నిజాయితీపరులు వారికి సంపద ఇస్తే వారు సంపదను పెంచుతారని వివిధ సభలలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రణాళికలు తలకిందులయ్యాయి అని చెప్పవచ్చు. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు 7,29,067 లబ్ధిదారుల గాను సగం మందికి మాత్రమే అనగా 3.46 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడత పేరుతో లబ్దిదారులను నిరాశకు గురి చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని కోరుతూ గొర్రెల మేకల పెంపకం సంఘం ఆధ్వర్యంలో 2019 సెప్టెంబర్‌ 18న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించి సెప్టెంబర్‌ 25, 2019 నుంచి రెండో విడత పథకం ప్రారంభిస్తున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. ఆచరణలోకి వచ్చేసరికి మూడేండ్లుగా సగం మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపించించారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. అర్ధాంతరంగా నిలిపివేయడంతో డీడీలు కట్టిన గొర్రెలకాపరులు సుమారు 28 వేల మంది ఒక్కొక్కరు రూ.31 వేలా 250 చొప్పున,87.5 కోట్ల రూపాయలు టీటీసీి ప్రభుత్వ ఖజానాలో జమ చేసి రెండేండ్లు గడుస్తోంది. లబ్దిదారులు రెండేండ్లుగా వేచి చూస్తున్నా, ఈ పథకంలో అవినీతి జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే రెండో విడత ప్రారంభించాలని, డీడీలు కట్టిన వారికి సబ్సిడీ గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్‌తో కాపరులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో 2020 సెప్టెంబర్‌ 21న తెలంగాణ గడి ముట్టడి కార్యక్రమం పేరుతో జీఎంపీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు

Related Posts