YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలాశయం 4 గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత

శ్రీశైలం జలాశయం 4 గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత

శ్రీశైలం జలాశయం 4 గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత
శ్రీశైలం
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రి నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది జలాశయంలోని 12 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరదనీటిని డ్యామ్ అధికారులు విడుదల చేస్తున్నారు జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరడంతో శ్రీశైలం జలాశయంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంది జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు  ఒక లక్షా 4 వేల 240 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతుండగా సుంకేశుల నుంచి 67 వేల 20 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతుంది అలగే హంద్రి నుంచి 117 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది శ్రీశైలం
జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది పూర్తి స్దాయి నిటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.8450 టీఎంసీలకు చేరుకుంది ఇన్ ఫ్లో ఒక లక్షా  71 వేల 377 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఒక లక్ష 76 వేల 034 క్యూసెక్కులుగా ఉంది శ్రీశైలం కుడిగట్టు,  ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో పూర్తి స్దాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదనీటిని నీటిని విడుదల చేస్తున్నారు

Related Posts