YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
* ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఓటు హక్కును వినియోగించుకోవాలి
 ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తు.చ. తప్పక పాటించాలి
* జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు
బద్వేలు, అక్టోబర్ 11
బద్వేలు (ఎస్సీ) నియోజకవర్గం-124 ఉప ఎన్నికలను.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో  నిర్వహించేందుకు.. ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు అన్నారు.
బద్వేలు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన పై.. బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్, ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్ ఆశిష్ తో కలిసి.. జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు.. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి. విజయరామరాజు మాట్లాడుతూ... బద్వేలు ఉపఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అభ్యర్థులు ఏవైనా అనుమానాలు ఉంటే తమను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. అలాగే ఏవైనా ఫిర్యాదులు ఉంటే తప్పక వ్రాతపూర్వకంగా లేదా.. 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే.. సి.విజిల్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయాలని అన్నారు.
ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికలో  ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ.. అధిక సంఖ్యలో పాల్గొని.. అవగాహనతో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు.. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటింగ్ జరిగే  ఆయా ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉంటే.. తమ దృష్టికి తీసుకువస్తే.. స్వయంగా వెళ్లి పరిశీలిస్తామన్నారు.
బద్వేలు రిటర్నింగ్ అధికారి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ... బద్వేలు ఉప ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి 27 మంది అభ్యర్థులకు గాను  35 నామినేషన్ దాఖలయ్యాయని, అందులో.. 9 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయన్నారు. 18 అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని.. అభ్యర్థులకు తెలిపారు.
బద్వేలు ఉప ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్ ఆశిష్ మాట్లాడుతూ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనలను పార్టీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు తప్పక పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది, నామినేషన్ చేసిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts