YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇప్పుడే లోకల్..వోకల్

ఇప్పుడే లోకల్..వోకల్

విజయవాడ, అక్టోబరు 13,
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆగ్రహం ఇంకా ఏపీ ప్రజల్లో చల్లార లేదు. రాష్ట్రం విడిపోయినందున అన్ని విధాలుగా నష్టపోయామని ఏపీ ప్రజలు ఇప్పటికీ మదన పడుతుంటారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన మంటలు చల్లారకముందే ప్రాంతాల వారీగా మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి. ఇది ఆందోళన కల్గించే అంశమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేవలం 13 జిల్లాల ఏపీగా మారింది. ఇప్పుడు మరోసారి ప్రాంతాల వారీగా ఉద్యమాలు మొదలవ్వడం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించేలా చేసింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పదమూడు జిల్లాల ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. కనీసం హైకోర్టును కూడా కర్నూలులో పెట్టలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. ఇది ప్రాంతాల మధ్య మరింత చిచ్చు రగిలించిందనే చెప్పాలి. అయితే మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నామని వైసీపీ చెప్పుకుంది.ఇక ఇటీవల టీడీపీ మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత నష్టపర్చేవిగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి మరోసారి రాయల తెలంగాణను ప్రస్తావించడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక చంద్రబాబు కూడా నేరుగా కాకుండా మూడు ప్రాంతాల్లో అభివృద్ధిపై అక్కడ పార్టీల చేత ఆందోళనలు చేయిస్తున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరగడం లేదని ప్రాంతాల వారీగా ఆందోళన చేయిస్తున్నారు.
ఉత్తరాంధ్ర సమస్యలపైన అక్కడ నేతలతో ఉద్యమాలను చంద్రబాబు చేయిస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు జగన్ అన్యాయం చేశారంటూ అక్కడి నేతల చేత సమావేశాలు, ధర్నాలు చేయిస్తున్నారు. ప్రకాశం టీడీపీ నేతల చేత వెలిగొండ ప్రాజెక్టు పై ఆందోళన చేయిస్తున్నారు. వీటన్నింటి వెనక చంద్రబాబు ఉన్నా ఆయన ఎక్కడా బయటపడటం లేదు. తాను ఒక ప్రాంతానికి చెందిన నేతను కాదని చెప్పుకునేందుకు చంద్రబాబు మౌనంగానే ఉంటున్నారు. అక్కడి నేతలచేత మాట్లాడిస్తూ ప్రాంతీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా తమకు తెలియకుండానే ప్రాంతీయ ఉద్యమాలకు తెరలేపుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Related Posts