YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

రూ. 50 కి చేరిన టమాటా

రూ. 50 కి చేరిన టమాటా

రైతుల పరిస్థితి ఎప్పుడెలాగుంటుందో వాళ్లకే తెలియడం లేదు. రైతు కష్టాన్ని పక్కనబెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. కూరగాయలు పండించే రైతుల పరిస్థితి అయితే మరి దారుణంగా మారింది. మొన్నటివరకు టమాటా రైతులది ఇదే పరిస్థితి. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.మొన్నటివరకు టమోటా రైతులు గిట్టుబాటు ధర లేక టమాటాను రోడ్లపై పారబోశారు. మరికొందరు పంటను పశువులకు వదిలేశారు. రైతులు టమాటా పంట తీసివేయటంతో వెంటనే టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు చాలా కిలో రూ.10 పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా రూ 50 పలుకుతోంది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో టమాటా రైతులే ఆశ్చర్యపోతున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారుఆంధ్రప్రదేశ్‎లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌కు పెద్దఎత్తున టమాటా తరలివస్తోంది. టమాటా ఎక్కువగా పండే తుగ్గలి, మద్దిగెర, జొన్నగిరి ప్రాంతాల నుంచి పత్తికొండ మార్కెట్‌కు చేరుతోంది. ఒకవైపు డిమాండ్... మరోవైపు ఎగుమతులు పెరగడంతో టమాటా సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. టమాటాకు మంచి ధర పలుకుతోన్నా ఆ స్థాయిలో పంట దిగుమతి లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. ధర ఉన్నప్పుడేమో దిగుబడి ఉండదు. మంచి దిగుబడి ఉంటే ధర ఉండదు. ఇలా, ఎలా చూసినా నష్టపోయేది మాత్రం రైతన్నే అవుతున్నాడు.అయితే టమాటా ధర పెరగడంతో సామాన్యుడిపై భారం పడనుంది. ఇప్పిటికే పెట్రోల్, డిజీల్, వంట నూనె ప్రజల నడ్డివిరుస్తోంది. తాజాగా టమాటా ధర పెరగటంతో కొందరు టమాటా వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఉల్లి రేటు కూడా పెరగటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related Posts