YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కార్తీక దామోదర మాసము

కార్తీక దామోదర మాసము
శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదు. కార్తీక మాసాన్ని దామోదర మాసం  శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైనదో ....
ఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదా దేవి ఆపనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంధీ. తాను వంట గదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంట గదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోడానికి వెళ్లిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు.బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని, అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది.
"ప్రపంచాన్ని బంధించడం సాధ్యమా"
తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య, తన తల్లి తనవల్ల బాధపడకూడదని. ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము (తాడు)తో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసం *కార్తీక దామోదర మాసము*

Related Posts