YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

మారుతి తొలి విద్యుత్ కారు...

మారుతి తొలి విద్యుత్ కారు...

ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో ఈ-సర్వైవర్‌ను ప్రదర్శించబోతున్న సంస్థ

బలెనో, స్విఫ్ట్, డిజైర్, సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా... ఇలా ఎన్నెన్నో విప్లవాత్మక కార్లను మార్కెట్‌కు, వినియోగదారులకు పరిచయం చేసిన మారుతి సుజుకీ.. మరో విప్లవాత్మక కారును ఆవిష్కరించబోతోంది. అదే ఎలక్ట్రిక్ కారు. ఇప్పటిదాకా పెట్రోల్, డీజిల్ కార్లనే ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ.. ఫిబ్రవరిలో ఢిల్లీలో నిర్వహించబోతున్న ఆటో ఎక్స్‌పోలో ఈ కారును అందరికీ పరిచయం చేయబోతోంది. ఈ-సర్వైవర్‌గా చెబుతున్న ఈ కారు గురించి సంస్థ పలు వివరాలను వెల్లడించింది. ‘‘భారత్‌లో విద్యుత్ వాహనాల అభివృద్ధికి, వాటి విడిభాగాలు, చార్జింగ్ వసతులు, రీసైకిల్ సహిత బ్యాటరీల అభివృద్ధి కోసం మా వంతు కృషి చేయడంలో భాగంగా ఈ ఈ-సర్వైవర్‌ను రూపొందించాం’’ అని మారుతి సుజుకీ ఓ ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్ వాహనంగా రూపొందించిన ఈ ‘కాన్సెప్ట్ ఈ-సర్వైవర్’.. అధునాతన సాంకేతిక సమ్మేళనమని సంస్థ ప్రకటించింది.

ఫేస్  అనే భవిష్యత్ పరిజ్ఞానంతో ఈ-సర్వైవర్‌ను అభివృద్ధి చేశామని పేర్కొంది. ఇక, సుజుకీ-టయొటా భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతోనే దీనిని అభివృద్ధి చేశామని, ఆ విద్యుత్ వాహన పరిజ్ఞానం తమ వద్ద లేదని, అది కాదనలేని నిజమని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇక, కారు విద్యుత్ చార్జింగ్ విషయానికొస్తే.. దానికి సంబంధించిన మౌలిక వసతులను కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ చార్జింగ్ సదుపాయాలను తామే సొంతంగా ఏర్పాటు చేస్తామని, ఏ విదేశీ సంస్థల సహకారం అవసరం లేదని సంస్థ ప్రకటించింది. కాగా, ఈ-సర్వైవర్‌‌తో పాటు అదే ఆటో ఎక్స్‌పోలో సరికొత్త అవతార్ కలిగిన స్విఫ్ట్‌ను, కాంపాక్ట్ కార్ల విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే రీతిలో డిజైన్ చేసిన ‘ఫ్యూచర్ ఎస్’ కాన్సె్ప్ట్ కారును ప్రదర్శించబోతోంది సంస్థ. 

Related Posts