YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఆగని పసిడి పరుగుల

ఆగని పసిడి పరుగుల

ఆగని పసిడి పరుగుల
ముంబై, నవంబర్ 13,
ఫెస్టివల్‌‌ సీజన్‌‌ ముందు వరకు డల్‌‌గా ఉన్న బంగారం ధరలు రికార్డు లెవెల్‌‌లో పెరిగాయి. పసిడి రేట్లు గురువారం తొమ్మిది నెలల హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఎక్కువ కావడంతో లోకల్‌‌గానూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌‌ (ఎంసీఎక్స్‌‌)లో గోల్డ్‌‌ ఫ్యూచర్స్‌‌ పది గ్రాముల ధర 0.9 శాతం పెరిగి రూ.49,292లకు ఎగిసింది. కిలో వెండి ధర ఒకశాతం పెరిగి రూ.66,570లకు దూసుకెళ్లింది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్సు బంగారం (దాదాపు 28 గ్రాములు) 1,860.59 డాలర్లకు చేరుకుంది. యూఎస్‌లో ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరగడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా పసిడిని కొంటున్నారు. దీంతో  డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయమై కమోడిటీస్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ అమిత్‌‌ ఖరే మాట్లాడుతూ ‘‘అమెరికాలో ధరలు పెరిగాయి.  చైనాలోనూ ఇన్‌‌ఫ్లేషన్‌‌ ఎక్కువే ఉంది. అందుకే బంగారానికి గిరాకీ ఎక్కువయింది. అమెరికాలో కన్జూమర్‌‌ రేట్లు గత నెల విపరీతంగా పెరిగాయి’’ అని ఆయన వివరించారు. ఇన్‌‌ఫ్లేషన్‌‌తోపాటు వడ్డీరేట్లపైనా ఆందోళన కూడా బంగారానికి డిమాండ్ పెరిగేందుకు కారణమైందని ప్రొఫీషియెంట్‌‌ ఈక్విటీస్‌‌ లిమిటెడ్‌‌ ఫౌండర్‌‌, డైరెక్టర్‌‌ మనోజ్‌‌ దాల్మియా చెప్పారు. అయితే ఇప్పటికీ రేట్లు అదుపులోనే ఉన్నాయని వివరించారు. ‘‘ఈ ఏడాది ఆగస్టులో పసిడి ధర రూ.48 వేల సమీపానికి చేరుకున్నప్పటి నుంచి ధరలు పుంజుకుంటున్నాయి. డౌన్‌‌ట్రెండ్‌‌ ముగిసింది.  పండగలూ కలిసి వచ్చాయి. సాధారణంగా డిసెంబరు–జనవరిలో ధరలు పెరుగుతుంటాయి’’ అని అన్నారు.మామూలుగా అయితే డాలరు బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితి కనిపించడం లేదు. రూపాయితో డాలర్‌‌ మారకం విలువ 15 నెలల హైకి చేరినప్పటికీ బంగారం ధరలూ పైపైకే వెళ్తున్నాయి. కరోనా నష్టాలను భరించడానికి కంపెనీలకు ప్రభుత్వాలు ఇచ్చే స్టిములస్‌‌లు తగ్గడం, చాలా దేశాల సెంట్రల్‌‌ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడం లేదా అలాగే ఉంచడం వంటివి కూడా గోల్డ్‌‌రేట్ల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇన్‌‌ఫ్లేషన్‌‌ పెరిగినప్పటికీ వడ్డీ రేట్లను పెంచబోమని అమెరికా ఫెడరల్‌‌ రిజర్వ్‌‌ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. ఆర్‌‌బీఐ కూడా వడ్డీరేట్లలో మార్పులను తీసుకురావడానికి ఇష్టపడలేదు. బంగారంతోపాటు ఇతర విలువైన మెటల్స్‌‌ ధరలూ పైకి వెళ్తున్నాయి. స్పాట్‌‌ సిల్వర్‌‌ ఔన్స్‌‌ ధర 1.2 శాతం పెరిగి 24.91 డాలర్లకు(దాదాపు రూ.1,628) చేరింది. ప్లాటినమ్‌‌ రేట్లు 1.4 శాతం పెరిగి 1,082 డాలర్లకు చేరుకున్నాయి. ఔన్సు పలాడియం రేటు 1.5 శాతం పెరిగి 2,050.23 డాలర్లు పలుకుతోంది. అయితే   ఇప్పుడున్న ధరలతో ఇన్వెస్ట్‌‌మెంటు కోసం బంగారాన్ని కొనడం తెలివైన పని కాదని అమిత్‌‌ ఖరే అన్నారు. కొంత కరెక్షన్‌‌ వచ్చే దాకా ఎదురుచూడటమే మంచిదని ఆయన వివరించారు.అమెరికా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులే బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం. అక్కడ కన్జూమర్‌‌ ప్రైస్‌‌లు అక్టోబరులో 6.2 శాతం పెరిగాయి. 1990 తరువాత ఇవి ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. యూఎస్ కామెక్స్‌‌లో బంగారం ధర ఇటీవల 40 డాలర్ల వరకు పెరగడంతో ఇండియా ఎంసీఎక్స్‌‌లో గోల్డ్‌‌ ఫ్యూచర్స్‌‌ రేటు రూ.49 వేలకు చేరాయి. అయితే తమ దేశంలో కన్జూమర్‌‌ ప్రైస్‌‌లు మరింత పెరిగితే మాత్రం వడ్డీరేట్లను తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయని యూఎస్‌‌ ఫెడ్‌‌ ఆఫీసర్లు ఇటీవల ప్రకటించారు. ఇదే జరిగితే ధరలు దిగిరావడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజుల వరకు అయితే ధరల ట్రెండ్‌‌ ఇలాగే ఉంటుంది. బయ్‌‌ జోన్‌‌ రూ.48,800 కాగా, టార్గెజ్‌‌ జోన్‌‌ రూ.49,300. సెల్‌‌ జోన్‌‌ రూ.48,600 కంటే తక్కువ ఉంటే టార్గెట్‌‌ జోన్‌‌ రూ.48,300 అవుతుంది.

Related Posts