YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి..

హనుమలో శివుడుని దర్శించిన సీతమ్మతల్లి..
హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో  ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను   నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ   పిలు పిలు నీకే అర్థం అవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి  హనుమను భోజనానికి పిలిచింది.  తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ  కడుపునిండా తిను నాయనా  మొహమాటపడకు  అని చెప్పింది . "సరేనమ్మా" అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు  సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది  హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతాతింటున్నాడు.  కాసేపట్లో సీతమ్మ స్వయంగాచేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండినవంటతెప్పించింది. అదీ అయిపోయింది  తలవంచుకునే  ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు  హనుమ  ఆవురావురమంటూ  సీతమ్మకి కంగారు పుట్టి "రోజూ ఏం తింటున్నావు నాయనా"  అని అడిగింది వినయంగా.
"రామ నామం తల్లీ" వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు  హనుమ  సీతమ్మ త్రుళ్లిపడింది నిరంతరం  రామనామం భుజించేవాడు  భజించేవాడు శివుడొక్కడే గదా  సీతమ్మతల్లి తేరిపార జూసింది  అపుడు కనిపించాడు సీతమ్మకి  హనుమలో శంకరుడు శంకరుడే హనుమ  నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించే వాడికి  తాను మరి ఏమి పెట్టగలదు! .
సీతమ్మ ఒక అన్నపు ముద్దను పట్టుకుని  రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది  ఆ ముద్దని  భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి  అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా  హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి.

Related Posts