YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈనాడు వైకుంఠ చతుర్దశి.

ఈనాడు  వైకుంఠ చతుర్దశి.
కార్తీక శుద్ధ చతుర్దశిని "వైకుంఠ చతుర్దశి" గా లేక "పాషాణ చతుర్ధశి" గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది. మరి ఈనాడు ఆస్తికులైన మన విద్యుక్త ధర్మాలేమిటో? వాటికున్నప్రాముఖ్యత ఏమిటో? తెలుసుకుందాం.
*-:వైకుంఠ చతుర్ధశి:-*
ఒకానొకప్పుడు  దేవర్షి శ్రీనారదులవారు శ్రీమన్నారాయణమూర్తిని ఇలా ప్రశ్నించారట!
స్వామి  సాధారణ ప్రజలైన నీ భక్తులకు నీ నిత్యనివాసమైన వైకుంఠం  ఎలా లభిస్తుందని? అడుగగా.   శ్రీమహావిష్ణువు  నారద నన్ను వైకుంఠ (కార్తీక) చతుర్ధశి రోజున నన్ను వైకుంఠ నారాయుణునిగా అర్చించే ఆస్తికునకు నా అనుగ్రహం లభించి తప్పకుండా వైకుంఠాన్ని  చేరుకుంటాడని సమాధానమిచ్చి,  జయ, విజయ లకు వైకుంఠ చతుర్ధశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని ఆజ్ఞాపించారు. కనుక శ్రీహరిని ఈ రోజు పూజించేవారు తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటారని సాక్షాత్తు స్వామివారే అభయమిచ్చారు. కనుకనే ఈ కార్తీక శుద్ధ చతుర్దశికి  వైకుంఠ చతుర్ధశి అని ప్రసిద్ధికెక్కినది. అంతే కాకుండా ఈ కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్ధశి అని పేరు రావటానికి మరొక్క ఐతిహ్యం కలదు.
మహావిష్ణువు పరమశివున్ని కాశీ వెళ్ళి  పూజించడం చేత ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పేర్కొనబడి వైకుంఠ చతుర్ధశి ఖ్యాతిని గడించింది. దీని ద్వారా హరి హరులకు ఎంతమాత్రము భేదం లేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది.ఈ రోజున కంచు కుందులలో దీపాలను వెలగించడం, దీపదానం చేయడం అద్భుత ఫలితాలు ఇస్తుంది.
*-:పాషాణ చతుర్దశి వ్రతం:-*
నేటి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేస్తారు. ఇవ్వాల్టి రోజున యముడిని పూజించి ఆయన ప్రీతికై దున్నపోతు, లేకుంటే గేదెను యోగ్యుడైన సద్బ్రాహ్మణునికి దానం చేస్తారు. ఇలా చేయడం వలన అకాల మృత్యువులు తొలగుతాయని ఐతిహ్యం కలదు. ఇలా కార్తీక మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్ది మందికే తెలుస్తుంది.  అందరికీ కార్తీక శుభ దినాలను ఎలా ఏమేమి నిర్వహించుకోవాలి? ఏం చేయాలి? దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో అనే విషయం పై మన  సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఏమి చెప్పబడినదో ఇకనుంచైనా తెలుసుకుని యథాశక్తిగానైనా ఆచరించి తరించడానికి ప్రయత్నిద్దాం భగవదనుగ్రహానికి పాత్రులమవుదాం.

Related Posts