YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సంక్షోభంలోనే కాంగ్రెస్ పార్టీ

సంక్షోభంలోనే కాంగ్రెస్ పార్టీ

ఛండీఘడ్, నవంబర్ 17,
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. పీసీసీ  అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దు, ఆడిందే అట పాడిందే పాట అన్నట్లుగా  సాగుతున్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మరో మూడు నలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. సొంత పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా పీసీసీ చీఫ్, పార్టీ అధిష్టానాన్ని సవాలు చేసి మాట నెగ్గించుకున్నారు. ఆయన పెట్టిన షరత్ కు తలొగ్గి ముఖ్యమత్రి అడ్వకేట్ జనరల్ మార్చారు. ఇలా తోక కుక్కను ఆడించడం పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదని, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ఆవేదన వ్యక్తం చేశారంటే పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.పంజాబ్ పరిస్థితి అలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మరో కీలక రాష్ట్రం రాజస్థాన్’లో ముఖ్యమంత్రి  అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న అతర్గత కుమ్ములాటలు మరోమారు తాజాగా తెర మీదకు వచ్చాయి.నిజానికి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సంవత్సర కాలంపైగా పైలట్ వర్గం ఆశగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణను దిగ్విజయంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. చివరకు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా జోక్యం చేసుకున్నా, గెహ్లాట్ లైట్’గా తీసుకున్నారు.  ఇప్పటికే ఒకటికి రెండుసార్లు తమ వర్గానికి మంత్రి వర్గంలో స్థానం కలిపించేందుకు ప్రయత్నించి భంగ పడిన సచిన పైలట్, మరోమారు, ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సుమారు  45 నిముషాల పాటు ఆయన సోనియాకు తమ ఆవేదన, రోదనా వినిపించారాణి సమాచారం. అలాగే, పైలట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. 2023లో రాజస్థాన్‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు.మరోవంక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్,ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ అజయ్ మాకెన్‌ను కలిశారు. రాజస్తాన్‌లో 30 మంది మంత్రుల మండలిలో ప్రస్తుతం 9 ఖాళీలు ఉన్నాయి. రాజస్థాన్ మంత్రి మండలిలో సీఎం గెహ్లాట్‌తో సహా 21 మంది మంత్రులు ఉన్నారు. గత ఏడాదిలో జులైలో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ మద్దతుదారులు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.అపప్తి నుంచి ఆ పోస్టులు ఆలా ఖాళీగానే ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య సంధి కుదిరిన ముఖ్యమంత్రి గెహ్లాట్ రాజకీయ చతురతో పైలట్ ప్లాన్’ ను ఎప్పటికప్పుడు పల్టీ కొట్టిస్తునే ఉన్నారు.ఈ నేపధ్యంలో ముఖ్యమత్రి  గెహ్లాట్ ఈసారి అయినా, పైలట్ వర్గానికి మంత్రి పదవులు ఇస్తారా, లేక పోమ్మనకుండా పొగ పెట్టి పంపిస్తారా అనేది చూడవలసి వుంది. నిజానికి, పైలట్ వర్గం ఇప్పటికే బీజేపీతో టచ్’ లో ఉన్నట్లు వార్త లొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పైలట్ కలిసి ప్రయాణం  చేసిన జ్యోతి రాదిత్య సింధియా, బీజేపీలో చేరి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.

Related Posts