YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

డీఎస్పీల ప్రమోషన్ ఎప్పుడు

డీఎస్పీల ప్రమోషన్ ఎప్పుడు

తిరుపతి, నవంబర్ 30,
రాష్ట్రంలో డిప్యూటి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డిఎస్పి) పోస్టింగ్‌ కావాలా.. అయితే 'పలుకు'బడి ఉండాల్సిందే. స్థానిక ఎంపి, ఎమ్మెల్యేతోపాటు మంత్రుల సిఫార్సులుంటే తప్ప పోస్టింగ్‌ రాని పరిస్థితి నెలకొంది. డిఎస్పి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంలేదు. ఫలితంగా డిఎస్పి పోస్టింగ్స్‌ కోసం నెలల తరబడి వెయిటింగ్‌ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా డిఎస్పి క్లియర్‌ వెకేన్సీలు ఉన్నట్లు సమాచారం. ఐదారు నెలలుగా 30 మంది డిఎస్పిలు వెయిటింగ్‌లో ఉన్నారు. అయినా ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడం గమనార్హం. రెండున్నర నెలల క్రితం 14 మంది డిఎస్పిలను డిజిపి గౌతం సవాంగ్‌ బదిలీ చేశారు. వారిలో వెయిటింగ్‌లో ఉన్న ఐదుగురికి పోస్టింగ్స్‌ ఇవ్వగా, బదిలీలలు చేపట్టిన వారిలో మరొకరిని డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో 43 మంది డిఎస్పిలకు ప్రభుత్వం అదనపు ఎస్పిలుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందినప్పటికీ వారు ఇంకా డిఎస్పిలుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతి పొందిన వారిని అదనపు ఎస్పి పోస్టులలో నియమిస్తే మరో 43 ఖాళీలు ఏర్పడుతాయి. మొత్తం వేకెన్సీలు 93 చేరే వీలుంది.
డిఎస్పి పోస్టింగ్స్‌, బదిలీలలో రాజకీయ జోక్యం పెరగ డంతో భర్తీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికా రులు వాపోతున్నారు. మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలలో ఎవరికి ఇష్టం లేకపోయినా వాళ్లను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులు జారీ అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా డిజిపి కార్యాల యంలో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు ఐదారు నెలలుగా జీతభత్యాలు లేవు. వీరిలో కొందరు ఏడాది నుంచి పోస్టింగ్‌ లేకుండా ఉండటం గమనార్హం.

Related Posts