YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎకరా మిర్చి పంటకు 75 వేలు పరిహారం ఇవ్వాలి

ఎకరా మిర్చి పంటకు 75 వేలు పరిహారం ఇవ్వాలి

అనంతపురం
తుఫాను ప్రభావంతో మిర్చి పంట సా గుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయా రని, ఎకరాకు 75 వేలు ప్రకారం ప్రభు త్వం ఆర్థిక సహాయం చేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా రాయదు ర్గం మండల పరిధిలోని ఆవులదట్ల గ్రామంలో రైతులు సాగు చేసిన మిరప పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అ నంతపురం జిల్లాలో భారీ వర్షాల వల్ల మిర్చి పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు కోట్లాది రూపాయలు పంట పెట్టుబడులు నష్టపోయారన్నారు. వేరుశెనగ, వరి, పప్పు శెనగ, పత్తి పంటలతో పోల్చుకుంటే మిరప పంట కు పెట్టుబడి ఎక్కువన్నారు.మిరప పంటకు ఎకరాకు 1.20 నుండి 1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడిగా పెట్టారన్నారు. పంట చేతికొచ్చే సమ యానికి తామర పురుగు పట్టడం, భారీ వర్షాల వల్ల పంట కుళ్లిపోవడం వల్ల రైతులు కోలుకోలేని దెబ్బతిన్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు సింగయ్య చౌదరి తన ఐదు ఎకరాల పొలంలో మిరప పంట పెట్టడానికి దాదాపు 7.50 లక్షలమేర ఖర్చు చేసి నష్టపోయానని బాధను వ్యక్తం చేశారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలలాలను పరిశీలించడానికి ఇంతవ రకు ప్రభుత్వ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఎవరూ రాలేదని పలువురు రైతులు ఆయన దష్టికి తీసుకొచ్చారు.రైతు పక్షపాత ప్రభుత్వ మని ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీ నాయకులు, రైతులను ఆదుకోవడా నికి ఎందుకు ముందుకు రావడం లేదని మాజీమంత్రి మండిపడ్డారు.

Related Posts