YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుఫాన్ ముప్పు

తుఫాన్ ముప్పు

విశాఖపట్నం
అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చు అని తెలిపింది. ఈనెల 4వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 5వ తేదీన ఉత్తరాంధ్ర అంతట తీవ్ర వర్షాలు ఉండనున్నాయి. తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి రెండు చోట్ల అతి నుంచి అతి భారీ వర్షాలు కోరవచ్చు. తుఫాను  ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ హెచ్చరికల తో ఆయన కలెక్టరేట్ సమావేశమందిరంలో పోలీస్ కమిషనర్ తో కలిసి ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం జిల్లా మీద  ఉంటుందని, 3వ తేదీ నుండి 6 వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉంటుందన్నారు.  రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఇంజనీరింగ్ శాఖల తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  తుఫాను ముందస్తు, తీరందాటేటప్పుడు అనంతర సమయాలలో చేపట్టవలసిన చర్యలు గురించి సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్ డి వో లు, తాసిల్దార్ లు ఆయా డివిజన్లు మండలాల్లో ముందస్తు చర్యలపై సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. నౌకాదళ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి నుండే తయారుగా ఉండాలన్నారు.  వరి పంటకు సంబంధించి శాస్త్రవేత్తలు సూచించిన విధంగా రైతులందరికీ సమాచారం చేరవేయాలని వ్యవసాయ శాఖ జేడీ ని ఆదేశించారు. ఆర్ బి కె ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం రైతులందరికీ అందించాలి అన్నారు. విశాఖ నగరంలో లోతట్టు ప్రాంతాలను, పాత భవనాలు, ఇల్లు లను గుర్తించాలని,  సహాయక శిబిరాలు ఏర్పాటు  ప్రారంభించలని జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించారు.  జిల్లా వ్యాప్తంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలలో ఆనకట్టల వద్ద ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలను మొహరిం చాలన్నారు. తీరప్రాంతాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని, ఆహార పదార్థాలు, మందులు, త్రాగునీరు సిద్ధంగా ఉండాలన్నారు. గాలులకు చెట్లు కూలే అవకాశం ఉన్నందున అవసరమైన మర రంపాలను,  జెసిబి వాహనాలు, మానవ వనరులను సిద్ధంగా ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  విద్యుత్తు, రోడ్లను తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా సిబ్బందిని ఉంచాలన్నారు. ఆనకట్టల పరివాహక ప్రాంతంలో  వర్షపాతం కు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని,  ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.  జిల్లా అంతటా అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా  గ్రామాలలో బ్లీచింగ్, తాగు నీటి ట్యాంకులు సిద్ధంగా ఉంచాలని జడ్పీ సీఈవో, డీపీవో లను ప్రశ్నించారు.  మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

భయపడుతున్న జువాద్ తుఫాను

వరుస అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతులం చేస్తున్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన జవాన్ తుఫాను ఉత్తరాంధ్రను భయపెడుతోంది.బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా మారి డిసెంబరు 4లోపు ఒడిశా తీరాన్ని తాకనుందని ఐఎండీ హెచ్చరించింది. దీనికి జవాద్ తుఫానుగా పేరు పెట్టింది. ఈ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. గురువారం సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్‌, త్రివేండ్రం షాలీమార్‌, బెంగుళూరు కంటోన్మెంట్‌- గువహటి, అహ్మదాబాద్‌-పూరీ, కన్యాకుమారి- దిబ్రుఘఢ్ రైళ్లు రద్దయ్యాయి.శుక్రవారం పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమ ఎక్స్‌ప్రెస్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్, హౌరా-యశ్వంత్ పూర్ దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌‌ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమాండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ.ధన్‌బాద్-అలెప్పీ, టాటా-యశ్వంత్‌పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్‌-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, యశ్వంత్‌పూర్-హౌరా దురంతో, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్‌పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-హౌరా మెయిల్, వాస్కోడిగామా-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కోర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్, జగదల్‌పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రశాంతి నిలయం, హటియా-యశ్వంత్‌పూర్, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ –నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్, విశాఖ-కిరండూల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. జవాద్ తుఫాను నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్‌కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

Related Posts