YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం.

ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం.
మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రం లో ఉప్పు ఉంటుంది ..  ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కల్లు ఉప్పు అంటారు ....
ఉప్పు ని తొక్కకూడదు  శ్రీ మహాలక్ష్మి అని అంటారు.. . ఉప్పు ని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు ... చాల మంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని  అంటారు ... డబ్బు  నిలబడాలి అంటే ఎలా అంటే మీకు జీతము లేదా డబ్బు రాగానే మొత్తము అంటే  ఉప్పు అంటకుండ అంటితే తడి అవ్వకుండ ఉప్పు పోసిన కుండలో పెట్టి ఒక  రాత్రి నిద్ర చేయించి మరుసటి రోజు నుండి పెట్టిన మొత్తం తీసి వాడు కుంటే డబ్బు నిలుస్తుంది అంటారు..
యిలా ఉప్పు కుండలో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ ఉప్పు లాగేస్తుంది అంటారు ....అలానే రాత్రి పూట  ఉప్పు అనకూడదు అంటారు ...  రాత్రి పూట లవణం అని అనాలి ..  ఉప్పును   శనీశ్వరుడు కి నూనె తో పాటుగ వేస్తారు .. అదివేరే విషయం .... 
శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగ వేసి ఏదో అనుకూలంగ ఉన్న మూలన పెడితే ఆర్ధిక కష్టాలు తీరుతాయి అంటారు ... 
కాలము రోజులలో మంగళవారం . శుక్రవారం నాడు  యింటికి వచ్చిన ముత్తైదువులకు  , ముందుగ  చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి  పసుపు కొమ్ములు . కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు . 
అలా చేయడము వలన సిరి సంపదలు  అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు ..
కొందరు ఎర్రటి గుడ్డ లో రాళ్ళ ఉప్పు పోసి యింటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డ లో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలు లో వేయాలి ..
 అలా కట్టడం వలన  సుఖ సంతోషాలతో యిల్లు కళకళ లాడుతోంది అంటారు ....
ఏది ఏమి ఐన   ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరికాదు ....ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు అది కాదు రాళ్లుప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది ...
వితండవాదం చేయకండి .
నచ్చితే ఆచరించండి లేదా ఏమి ఇబ్బంది లేదు ... ఆచరణ వలన కలిగే ఫలితం ఉంటుంది . 
ఎవరి అభీష్టం వారిది.

Related Posts