YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తారా - తారిణి.

తారా - తారిణి.
17 వ శతాబ్దంలో  కళింగదేశాన్ని పాశుప్రహరాజ్  అనే రాజు  పాలిస్తూవుండేవాడు. ఆ మహారాజు కాలంలో ఋషికుల్యా నదీ తీరాన ఒక కొండమీద  అందమైన "తారా -తారణి" ఆలయం ఒరిస్సా శిల్ప శైలిలో నిర్మించబడినది. మన దేశంలోని 51 శక్తి పీఠాలలో  ఇది ఒకటి. ఈ స్థలంలోనే  సతీదేవి  గుండెభాగం  పడిన ప్రాంతంగా చెపుతారు.   భారతదేశంలో వున్న నాలుగు తాంత్రీక పీఠాలలో  ఒకటిగా చెప్తారు. ఆలయంలోని ప్రధాన దేవత తారా , తారణి అనే రెండు మూర్తులుగా దర్శనమిస్తున్నది. శాక్తేయభక్తులు యీ దేవి దర్శనానికి తండోపతండాలుగా వస్తారు. 
మహాభారత యుధ్ధ సమయాన పాండవులకి విజయం చేకూరాలని ,  అర్జునుడు, శ్రీకృష్ణుడు   'తారా తారణి '  అమ్మవారిని పూజించినట్టు తెలుపబడుతున్నది. కళింగ రాజులు తారా ఆనే దేవిని బంగారంతోను, తారిణి అనే దేవిని వెండితోను  తయారు  చేయించి శిరసులను మాత్రం రాగితో నిర్మించారు.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం,సంతానం యొక్క పురోభివృద్ధి కాంక్షించి  ఈ దేవిని పూజిస్తారు.  నవరాత్రి, దీపావళి , సంక్రాంతి మొదలైన పర్వదినాలలో అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారాలలో  విశిష్ట పూజలు జరుగుతాయి. దీపాపావళి రోజున దేవి మూర్తులకు తైలాభిషేకం చేసి, నూతన వస్త్రాలంకరణలు చేస్తారు.  తీపి పిండి వంటలు నివేదించి  ఆరాధిస్తారు.మార్చి.. ఏప్రిల్ మాసాలలో ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.ఆ ఉత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొంటారు.  ఆ సమయంలో తమ పిల్లలకి శిరోముండనం చేయించి దేవికి మ్రొక్కులు తీర్చుకుంటారు. దీనివలన తమపిల్లలకి తగిలిన దిష్టి  తొలగి సుఖసంతోషాలతో వుంటారని భక్తులుధృఢంగా నమ్ముతారు.

Related Posts