YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వాచకుడు-లేఖకుడు

వాచకుడు-లేఖకుడు
చరాచరాత్మకమైన ఈ ప్రపంచం బ్రహ్మ రచించిన ఒక సృష్టికావ్యం. ఈ సృష్టికావ్యంలో కోట్ల కొలది అధ్యాయాలున్నాయి. కోట్ల కొలది ఘట్టాలున్నాయి. ఇందులో నుంచి ఎన్నో పురాణేతిహాసాలు ప్రభవించాయి. ఎందరో మహర్షులు ఎన్నో చరిత్రలను సృష్టించారు. అలా ఎన్నో అద్భుతగాథలను సృష్టించినవాడు వ్యాస మహర్షి.
సాక్షాత్తూ విష్ణురూపుడైన వ్యాసుడు తొలుత భగవంతుడి ముఖ కమలంలో నుంచి వెలువడిన వేదవాణిని విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. అవి ఋక్‌, యజుః, సామ, అధర్వణ వేదాలుగా లోకంలో వ్యాపించాయి. అయినా వ్యాసుడికి తృప్తి కలగలేదు. మానవాళికి ధర్మార్థకామ మోక్షాలను సులభంగా, రమణీయ కథల రూపంలో అందించాలనుకున్నాడు. 
ధర్మబద్ధులైన భరతవంశజుల చరిత్రను మహేతిహాసంగా రచించాలనుకొన్నాడు. అతడి పవిత్ర హృదయాన్ని తెలుసుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు ఎంతో సంతోషించాడు. బ్రహ్మకు నమస్కరించి, సామాన్య మానవులను ఉద్ధరించాలని తాను చేస్తున్న ప్రయత్నాన్ని దీవించమని ప్రార్థించాడు. 
తాను రచించబోయే మహా గ్రంథం కోసం తాను చెబుతూ ఉంటే వేగంగా రాయగల లేఖకుణ్ని ప్రసాదించమన్నాడు. బ్రహ్మదేవుడు లోకోపకారకమైన వ్యాసుడి కోరికను మన్నించి- ‘మహర్షీ! నీ మహేతిహాసాన్ని వేగంగా రాయగలవాడు గణేశుడు ఒక్కడే! అతణ్ని ప్రార్థించు!’ అని పలికి అంతర్థానమైపోయాడు.
బ్రహ్మదేవుడి ఆశీస్సులు అందుకొన్న వ్యాసుడు మనసులో గణేశుణ్ని ధ్యానించాడు. వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యాడు. మహర్షి కోరికకు తన అంగీకారం తెలుపుతూ, తన లేఖిని ఆగనంత వేగంగా చెప్పాలని షరతు పెట్టాడు. వ్యాసుడు అందుకు అంగీకరించి- ‘గణేశా! నాదీ ఒక నియమం. నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్న తరవాతనే నీవు రాయాలి!’ అన్నాడు. గణేశుడు అందుకు అంగీకరించాడు.
వాచకుడిగా వ్యాసుడు, లేఖకుడిగా గణేశుడు తమ తమ పనిలో నిమగ్నమయ్యారు. వ్యాసుడు గణపతి వేగానికి తగినట్లే శ్లోకాలను చెబుతూ వచ్చాడు. వ్యాసుడు గణేశుడి వేగం తగ్గించేందుకు మధ్యమధ్య గ్రంథగ్రంథులను (క్లిష్టమైన అర్థాలు గల శ్లోకాలను) చెబుతూ వచ్చాడు. వాటిని అర్థం చేసుకొని రాయడానికి గణపతి కొంత వేగాన్ని తగ్గించవలసి వచ్చేది. ఇలా వ్యాసుడు లక్షశ్లోకాల విస్తారంగా భారతేతిహాస రచన చేశాడని, అందులో ఎనిమిది వేలా ఎనిమిది వందల గ్రంథగ్రంథి శ్లోకాలు చెప్పాడని ఐతిహ్యం.
ఇలా వ్యాసుడు, గణేశుల పుణ్యమా అని లోకానికి మహాభారతం లభించింది. మహాభారతం అనేక ధర్మాలకు నెలవు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడి విజయ సారథ్యంలో ధర్మమే గెలిచింది. అధర్మం నామరూపాలు లేకుండా నశించిపోయింది. 
మనిషి జీవితంలో ఎన్ని ఒడుదొడుకులను ఎదుర్కోవాలో భారతం వివరించి చెబుతుంది. ధర్మబద్ధంగా ఉంటేనే కుటుంబ జీవనం నిలుస్తుందని ప్రవచిస్తుంది. మానవులలోని రాగ ద్వేషాలు,   కుత్సితాలు, కుట్రలు, కుతంత్రాలు వంశాలను ఎలా నాశనం చేస్తాయో భారతం విశదం చేసింది.
ధర్మసంస్థాపన కోసం ఎందరు తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించారో తెలియజేసింది. 
కుటుంబాల్లో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎంతటి మానసిక శాంతిని కలిగిస్తాయో విడమరచి చెప్పింది. 
పూజ్యులపైన,  
ఆత్మీయులపైన,
స్త్రీలపైన ఎంతటి సౌశీల్యాన్ని ప్రదర్శించాలో ఎరుకపరచింది.
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయరామ జయ జయరామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ

Related Posts