YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఒమిక్రాన్ విరుగుడుకు మందు..: ఫైజర్ ప్రయత్నాలు సక్సెస్

ఒమిక్రాన్ విరుగుడుకు మందు..: ఫైజర్ ప్రయత్నాలు సక్సెస్

న్యూ ఢిల్లీ డిసెంబర్ 15
ఒమిక్రాన్ కు ఎదుర్కొనేందుకు కొత్త మందును కనిపెట్టారు. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.అమెరికా ఫర్మాన్యూటికల్ కంపెనీ ఫైజర్  ఒమిక్రాన్ బారిన పడ్డవారికి శుభవార్త తెలిపింది.  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తాము చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయని చెప్పింది. ఒమిక్రాన్ వైరస్ ను తట్టుకునేందుకు యాంటీ వైరల్ ట్యాబ్లెట్లను రూపిందించింది.అంతేకాకుండా ఇప్పటికే దీనిని 2వేల 250 మందిపై ప్రయోగించామని ఫైజన్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. వీరి నుంచి సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు పరిశోధకులు. అయితే వైరల్ తీవ్రత ఉండి లక్షణాలు తీవ్రంగా ఉంటేనే దీనిని వాడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఈ టాబ్లెట్ తో మరణాల శాతం కూడా 89 శాతానికి తగ్గిందని అంటున్నారు.
ఈ టాబ్లెట్ తయారు చేయడానికి ముందుగా వివిధ పరిశోధనలు చేశారు. ఆ తరువాత ఓ ప్రయోగం ఫలించింది. పునరుత్పత్తి కోసం ఒమిక్రాన్ వేరియంట్లోని కీలక ప్రొటీన్ ను కృత్రిమంగా తయరాు చేసిన ఈ టాబ్లెట్ ను ప్రచయోగించారు. దీతో మంచి ఫలితాలిచ్చాయి. ఆ తరువాత మరింత మందికి ఇచ్చారు. ఇలా 2 వేల 250 మందికి వీటిని ఇవ్వగా వారి నుంచి మంచి రిజల్ట్స్ వచ్చాయని వైద్య పరిశోధకులు తెలిపారు. అయితే దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ బోర్డు ఆమోదించాల్సి ఉంది.ఫైజర్ నుంచి ఇప్పటికే మొదటి వేరియంట్ ను తట్టుకునేందుకు వ్యాక్సిన్ తయారు చేశారు. అందరి కంటే ముందుగానే దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలోనూ ఫైజర్ టాబ్లెట్ తయారు చేసింది. అయితే ఇది రాను రాను ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఒమిక్రాన్ వాతావరణ పరిస్థితులను భట్టి మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు దీని తీవ్రత ఇంకా మొదలు కాలేదని దానికి సమయం పడుతుందని అంటున్నారు. అయితే మరణాలు పెరిగితే ఒమిక్రాన్ తీవ్రత మొదలైందని భావిస్తారు. ఆ సమయంలో టాబ్లెట్ పనిచేస్తుందా..? లేదా..? చూడాలి.ఇదిలా ఉండగా ఆయా దేశాలో వ్యాక్సిన్లు వందశాతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇండియాలో వైద్యారోగ్య శాఖకు టార్గెట్ పెట్టి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రజలు పనిచేసే చోటుకు వెళ్లీ మరీ టీకా అందిస్తున్నారు. వ్యాక్సిన్ పూర్తయితేనే ఒమిక్రాన్ ను ఎదుర్కోగలమని అంటున్నారు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఇది సోకడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒమిక్రాన్ తన రూపు మార్చుకుంటే మాత్రం ఫైజర్ టాబ్లెట్ అవసరం పడుతుందా..? అని చర్చించుకుంటున్నారు.అయితే ఇప్పటికే ఒమిక్రాన్ సోకకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కొందరు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. స్వల్ప లక్షణాలున్నా మరణాలు సంభవిస్తే ఏం చేయాలి..? అన్న దానిపై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకపోతే రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించడమే మనకు అసలైన మందు అని అంటున్నారు.

Related Posts