YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

27 తర్వాత స్కూళ్లు

27 తర్వాత స్కూళ్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18,
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా దాదాపు నెల రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలను తెరిచేందుకు ఢిల్లీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం నవంబర్ 13న ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ సర్కార్‌ పాఠశాలలు తెరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా మూతపడ్డ పాఠశాలలను వెంటనే తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని 6వ తరగతి నుంచి పై తరగతుల విద్యార్థులకు, కాలేజీ, విద్యాసంస్థలను డిసెంబర్‌ 18 నుంచి తెరవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటిసు ద్వారా శుక్రవారం అధికారులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5వ తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్‌ తరగతులు డిసెంబర్‌ 27 నుంచి ప్రారంభం కావచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.పాఠశాలలు, విద్యాసంస్థలను తెరవడం బలవంతపు అవసరం అని వాధిస్తూ పెద్ద ఎత్తున ప్రతిపాదనలు అందాయని కమిషన్‌ పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, విధించిన ఆంక్షలపై సడలింపులకు సంబంధించి వివిధ సంస్థల అభ్యర్థనలను కమిషన్ పరిశీలించిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం పెరిగినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం డిసెంబర్‌ 3న దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలు మూసివేశారు.

Related Posts