YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అర్హులందరికీ సాయం అందాలి

అర్హులందరికీ సాయం అందాలి

అమరావతి
రాష్ట్రంలో అమలవుతున్నసంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మంగళవారం నగదు జమ చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఓ ఒక్కరూ మిస్ కాకూడదన్నారు. గత ప్రభుత్వాలు కట్ చేయాలని చూశాయి. వైసీపీ ప్రభుత్వం అలా కాదని విప్లవాత్మకంగా వెళ్తుందని జగన్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆర్హులందరికీ నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో 39లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు 61లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ 2500అవుతుందన్నారు.

Related Posts