YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

జీవో 317కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన..!

జీవో 317కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన..!

హైదరాబాద్ జనవరి 3,
ఎలాంటి కష్టం వచ్చినా.. ప్రశ్నిస్తామన్న ఆ ఎమ్మెల్సీలు.. కీలక సమయంలో ఏమయ్యారు? టీచర్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? కొత్త జోనల్‌ విధానంపై తప్పించుకుని తిరుగుతున్నారా? ఎవరా ఎమ్మెల్సీలు?కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల ప్రక్రియను మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్. చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. అలకేషన్‌కు సంబంధించిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉంది. వీరిలో టీచర్లు తెగించి రోడ్డెక్కారు. అన్యాయం జరుగుతోందని ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోతే తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నది వారి ఆవేదన. సీనియారిటీలో అన్యాయం జరుగుతోందని.. భార్యాభర్తల అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆప్షన్ ఒకచోట ఇస్తే.. తప్పుగా నమోదు చేసి మరోచోట పోస్టింగ్‌ ఇస్తున్నారని మండిపడుతున్నారు ఉపాధ్యాయులు.ఈ కీలక సమయంలో తమకు అండగా ఉంటారని భావించిన టీచర్‌ ఎమ్మెల్సీలు అజాపజా లేకపోవడంతో ఉపాధ్యాయులు.. టీచర్ల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణలో టీచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అయిన వారిలో జనార్దన్‌రెడ్డి, రఘోత్తమరెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. వీరిలో నర్సిరెడ్డి యూటీఎఫ్‌కు చెందినవారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి.. కొత్త జోనల్‌ విధానంలో అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నిస్తున్నారట.ప్రభుత్వానికి, అధికారపార్టీకి దగ్గర అని చెప్పుకొనే టీచర్‌ ఎమ్మెల్సీలు.. ఉపాధ్యాయ బదిలీల రగడపై కిక్కురు మనడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదో తెలియదు. స్పందిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారో ఏమో.. టీచర్లకు, టీచర్ల సంఘాలకు అందుబాటులో లేకుండా పోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పించుకుని తిరుగుతున్నట్టు చెబుతున్నారు. కనీసం ఉపాధ్యాయులకు భరోసా కల్పించేలా ఒక్క మాటా మాట్లాడ లేదట. కొత్త జోనల్‌ విధానంపై ప్రభుత్వం నిర్వహించిన చర్చల ప్రక్రియలో తమను భాగస్వామ్యం చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఇప్పుడు జీవోపై అభ్యంతరాలు ఉన్నా.. పట్టించుకునే పరిస్థితి లేదని సమాచారం. ప్రభుత్వానికి.. తమకు మధ్య వారధిగా ఉండాల్సిన సమయంలో ఎమ్మెల్సీలు టచ్‌మీ నాట్‌గా ఉండటం ప్రశ్నగా మారింది.

Related Posts