YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండో రోజు ఢిల్లీలో సీఎంజగన్ పర్యటన

రెండో రోజు ఢిల్లీలో సీఎంజగన్  పర్యటన

న్యూఢిల్లీ
దేశ రాజధానిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండవ రోజు పర్యటన కొనసాగింది. మంగళవారం నాడు అయన  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.  దాదాపు గంటసేపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరుచేసినందుకు సీఎం కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.  విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చ  జరిగింది.  విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సిఎం తెలిపారు.  సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని తెలిపారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని తెలిపారు.  విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరారు.  విజవాడ తూర్పు బైపాస్పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం.  ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తాం.  వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి  విజ్ఞప్తి చేసారు.

Related Posts