
ప్రముఖ జర్నలిస్టు, సామాజిక సేవకురాలు గౌరీ లంకేష్ హత్య కేసులో రెండో నిందితుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా అరెస్ట్ చేసింది. నిందితుడి వివరాలను సిట్ అధికారులు వెల్లడించలేదు. సిట్ అరెస్టు చేసిన నిందితుడికి గతంలో మహారాష్ట్రలోని మేధావులు నరేంద్ర దబోల్ కర్, ఎంఎం కల్ బుర్గీల హత్యలతోనూ సంబంధముందని అధికారులు అనుమానిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరు 5వతేదీన బెంగళూరులో గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన 8 నెలలకు రెండో నిందితుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. గతంలో అరెస్టు చేసిన నవీన్ కుమార్ ను ఇంటరాగేట్ చేయగా కాల్పులు జరిపిన రెండో నిందితుడి వివరాలు లభించాయని సిట్ అధికారులు చెప్పారు.