YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లక్ష దాటేసిన కేసులు

లక్ష దాటేసిన కేసులు

న్యూఢిల్లీ, జనవరి7,
జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును, ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసులు మళ్లీ వన్‌ లాక్‌ మార్క్‌ దాటాయ్. అది కూడా జస్ట్‌ 8 డేస్‌లో. కేవలం ఎనిమిదే రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష దాటాయి. గత 24 గంటల్లో లక్షా 17వేల కొత్త కేసులు రికార్డు అయ్యాయి. 200 డేస్‌ తర్వాత ఇదే హయ్యస్ట్‌ నెంబర్‌. గతేడాది జూన్‌ ఆరున ఫస్ట్‌ టైమ్‌ రోజువారీ కేసులు లక్ష మార్క్‌ను అందుకుంటే, మళ్లీ ఇప్పుడు కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది.కాగా.. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 30,836 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,43,71,845 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా.. డైలీ పాజిటివిటి రేటు అమాంతం 7.74 శాతానికి పెరిగింది. కాగా.. ఇప్పటివరకు దేశంలో 149.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.ఇదిలాఉంటే.. భారత్‌లో ఒమిక్రాన్‌ ఉధృతికి కూడా తెరపడడం లేదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 3,007 కు చేరింది. 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఈ వేరియంట్ నుంచి 1999 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.

ఒమిక్రాన్ తో టెన్షన్.. టెన్షన్
ఒమిక్రాన్ వల్ల ముప్పు ఏం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్ డిసీజెస్ విభాగం అధిపతి డాక్టర్ సమీరన్ పాండా అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా సోకి లక్షణాలు లేని రోగులు ఆస్పత్రిలో చేరాల్సి అవసరం లేదన్నారు. హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం చికిత్స పొందితే సరిపోతుందని చెప్పారు.ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముందుగా వైరస్ వేరియంట్, ట్రాన్మిసిబుల్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ సమీరన్ తెలిపారు. వైరస్ వ్యాప్తికి, వేరియంట్‌కు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నారు. ‘SARS CoV-2 వైరస్ రూపంతరం చెందడం ద్వారా ఏర్పడిన వైరస్ ఒమిక్రాన్. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణాలు ఇందులో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వైరస్‌కు, ఇంతకు ముందు వ్యాప్తి చెందిన వైరస్‌కు సంబంధించి లక్షణాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ సోకిన వారిలో లక్షణాలేవీ కనిపించడం లేదు. దాదాపు 70 శాతం ఒమక్రాన్ కేసులు లక్షణ రహితంగా ఉన్నాయి. వారు కోలుకునే వరకు కూడా ఎలాంటి లక్షణాలు బయటపడటం లేదు. అయితే, 30 శాతం మందికి మాత్రమే తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి.’ అని డాక్టర్ సమీరన్ తెలిపారు.మరోవైపు.. డెల్టా వైరస్ ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు, కొంతమంది యువకులలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరలెన్స్, వ్యాప్తి రెండూ ఒకేలా ఉండవన్నారు. ప్రస్తుత వేవ్‌లో డెల్టా/ఒమిక్రాన్ సోకిన వారికి ప్రాణాంతకం ఏమీ కాదన్నారు.ఒమిక్రాన్ ఫ్రీక్వెన్సీని నిత్యం పరిశీలిస్తున్నామన్నారు. అయితే, రోగికి టెస్ట్ చేసిన తరువాత వెల్లడయ్యే ఫలితాల ఆధారంగానే.. వారికి ఏ వైరస్ సోకిందనే నిర్ధారణ అవుతుందని చెప్పారు.ఇదిలాఉంటే.. ఒమిక్రాన్ సోకిన వారికి ఆక్సీజన్ అందించే పరిస్థితి ఇప్పటి వరకైతే లేదని డాక్టర్ సమీరన్ తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స అవసరం పడుతుందన్నారు. లేదంటే ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రానే కాదు.. డెల్టా కేసుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇంటెన్సీవ్ కేర్ అటెన్షన్ అవసరమయ్యే కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఆస్పత్రులన్నీ సన్నద్ధమయ్యాయని చెప్పారు డాక్టర్ సమీరన్. సెకండ్ వేవ్‌లో మాదిరి పరిస్థితి ఇప్పుడు ఉండదన్నారు. లక్షణాలు లేని రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించారు డాక్టర్ సమీరన్. చాలా ఆస్పత్రులు.. లక్షణాలు లేని కోవిడ్ పేషెంట్లను చేర్చుకుంటున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దని సూచించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయన్నారు. తీవ్రమైన కేసులను మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చాలనే నిబంధనలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయన్నారు. అయితే, ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఒకవేళ కరోనా సోకినా టెన్షన్ పడొద్దని, వైద్యుల సూచనల మేరకు ట్రీట్‌మెంట్ తీసుకోవాలన్నారు.
ICMR హోమ్ ఐసోలేషన్, కేరింగ్ గురించి సూచనలు చేసింది. అవేంటంటే..
1. కరోనా సోకిన వ్యక్తిని కలిసిన వ్యక్తులు.. తమలో ఎలాంటి లక్షణాలు లేకపోతే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
2. పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లే బదులు హోం క్వారంటైన్‌లో ఉండి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలి.
3. లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల మార్గదర్శకాల ప్రకారం ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.
4. ఆక్సీజన్ లెవల్స్, ప్రతీ 6 గంటలకు శరీర ఉష్ణోగ్రతలను మానిటరింగ్ చేసుకోవాలి. ఆక్సీజన్ లెవల్స్ తగ్గినా.. 3 రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా వెంటనే ఆస్పత్రిలో చేరాలి.
ప్రస్తుతం దేశంలో ఎన్నో వేవ్ నడుస్తోంది..
నిపుణుల ప్రకారం.. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న రాష్ట్రాల వారీగా డేటాను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ఐదవ దశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు మనవద్ద థర్డ్ వేవ్ ఉందా? నాలుగో దశ వ్యాప్తి జరుగుతోందా? ఐదో దశ వ్యాప్తిలో ఉన్నామా? అన్న సంశయాలు వస్తున్నాయి. అయితే, రాష్ట్రాల డేటా ఆధారంగా దీనిని నిర్ధారించడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. సెకండ్ వేవ్ సమయంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, టీకా కార్యక్రమాన్ని సక్రమంగా చేయని రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే కొన్ని చర్యలు పాటించాల్సి ఉంటుందని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని హితవు చెబుతున్నారు. జనసాంద్రత పెరిగితే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందన్నారు. వీలైనంత వరకు జన సమూహాల్లో సంచరించడం మానుకోవాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, సురక్షితంగా ఉండాలని హితవు చెబుతున్నారు.

Related Posts