YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం
ప్రముఖ శైవ క్షేతం శ్రీశైలంలో బుధవారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం జరిగింది. ఈ సాయంత్రం 5 .30గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ కొనసాగుతోంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు జరుపుతారు. ఈ నెల 18న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు  ముగుస్తాయి.  సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో ఆర్జిత మరియు ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణం, శ్రీ స్వామిఅమ్మవార్లకల్యాణం, ఏకాంతసేవలను నిలిపివేసారు. 14వ తేదీన ఉదయం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమం, 15వ తేదీన మహిళలకు ముగ్గులపోటీలు, 16వ తేదీన వేదశ్రవణం కార్యక్రమం, కనుమ పండుగ రోజున (16.01.2021) సంప్రదాయబద్దంగా గో పూజనిర్వహిస్తారు.

Related Posts