YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

అమీర్ పేట లో సంస్థలు మూసివేత

అమీర్ పేట లో సంస్థలు మూసివేత

హైదరాబాద్, జనవరి 21,
 ఐటీ జాబ్లు,  ఫారిన్ కలలతో అమీర్ పేటలో అడుగు పెట్టని బీటెక్ స్టూడెంట్స్ ఉండరు. ఓ వైపు క్రాష్ , ఫాస్ట్ ట్రాక్ కోర్సులు. మరో వైపు బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రైల్వే జాబ్లకు ట్రైనింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్లతో ఎస్ఆర్ నగర్, అమీర్ పేట ఏరియాలు సందడిగా ఉండేవి. కరోనా కారణంగా స్టూడెంట్లు ఇంటి బాటపడితే, ఇనిస్టిట్యూట్లకు వచ్చేవారు లేక రెండేండ్లుగా నిర్వహణ భారమవడంతో  బందైపోతున్నాయి.  అమీర్పేటలోని 83 కాంప్లెక్స్ల్లో  బల్దియా లెక్కలు ప్రకారం 1,871 ఇనిస్టిట్యూట్లు ఉండగా ఇప్పటికే 300కుపైగా మూతపడ్డాయి. ట్రైనింగ్ సెంటర్లు కూడా ఆన్ లైన్ కోర్సులు, ప్రత్యేక యాప్ ల ద్వారా ఈ–లెర్నింగ్లో చెబుతుండగా  ఇనిస్టిట్యూట్లకు వచ్చేవారు తగ్గిపోయారు.  వాటి కార్యకలాపాలను ఆన్ లైన్ కు మారడంతో కొన్ని సెంటర్లు ఖాళీ చేయగా.. మరికొన్ని సంస్థల్లో  స్టూడెంట్లు  లేక కంప్లీట్గా క్లోజ్ చేశారు. కరోనా ఫస్ట్వేవ్ టైమ్లో అమీర్పేట ఎక్కువ కేసులతో చర్చనీయాంశంగా మారింది.  అప్పటి నుంచి హాస్టళ్లలో ఆంక్షలు, ఇనిస్టిట్యూట్ల జాగ్రత్తలకు తోడు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. దీంతో ఫిజికల్ క్లాసుల సందడి తగ్గుముఖం పట్టింది. లాక్ డౌన్ ఆంక్షలతో 3 నెలల పాటు మూసి వేయగా ఇప్పటివరకు కోలుకోలేదు. గతేడాది జూన్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల రాక మొదలైనా, ఐటీ కంపెనీల కార్యకలాపాల ట్రైనింగ్కు వచ్చేవారు క్రమంగా తగ్గిపోయారు. ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ చదువులు కూడా ఆన్ లైన్ లో సాగుతుండడంతో అమీర్ పేట కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ఇప్పటికీ ఆన్ లైన్ లోనే..
కాంప్లెక్స్ సెల్లార్లు, కమ్యూనిటీ భవనాలు, ఫంక్షన్ హాళ్లలో ఒకేసారి వేలాది మందితో క్లాసులు నిర్వహించిన సంస్థలు కరోనా దెబ్బకు తేరుకోలేదు. లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నాయి.  కొన్ని బేసిక్ సీ, సీ ప్లస్, జావా, డాట్ నెట్ వంటి బేసిక్ కోర్సులను పూర్తిగా ఎత్తివేయగా, డిమాండ్ ఉండే పైథాన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులను అందించే సంస్థలు కూడా ఆన్ లైన్ లోనే క్లాసులను కొనసాగిస్తున్నాయి.   సిటీలో అమీర్ పేట్, కూకట్ పల్లి, హిమాయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ వంటి ఏరియాల్లోని బ్రాంచ్లను కూడా తగ్గించుకున్నాయి. దీంతో ఐదారు బ్రాంచ్ల్లో ట్రైనింగ్ అందించే సంస్థలు ఒక్క సెంటర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నడుపుతుండగా, క్లాసులను మాత్రం ఆన్లైన్లో నిర్వహిస్తున్నాయి. గతేడాది మే నుంచి ఫిజికల్ క్లాసులకు కొత్త బ్యాచ్లను ప్రారంభించినా స్టూడెంట్లు  రాలేదు. దీంతో కోర్సు మధ్యలో ఉన్న వారికి వీలుగా ఆన్ లైన్లోనే  రన్ చేశామని నారాయణ టెక్ సొల్యూషన్ నిర్వాహకుడు లక్ష్మణ్ చెప్పాడు.  స్టూడెంట్లు కూడా ఫిజికల్ క్లాసుల కంటే ఆన్లైన్ క్లాసులకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో నిర్వహణ భారమని మూసివేస్తున్నట్లు పలు ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు  చెప్తున్నారు. ఇప్పటికీ హోటల్ మేనేజ్మెంట్, బేసిక్ ఐటీ కోర్సులను నేర్చుకునేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదని అంటున్నారు. చాలా వరకు బీటెక్ కాలేజీలు బేసిక్ కోర్సులపై పూర్తి ట్రైనింగ్ ఇస్తుండడం ఇనిస్టిట్యూట్లకు ఆదరణ లేకపోవడానికి కారణమంటున్నారు.అమీర్పేటలోని హెచ్ఎండీఏ, బల్దియా కాంప్లెక్స్ల్లో క్లాసులు నిర్వహించే సంస్థలు రెంట్లు రద్దు చేయాలని ఆయా సంస్థలను కోరాయి.  అగ్రిమెంట్ ముగిసిన సంస్థలు మరికొంత కాలం పొడిగించాలని విన్నవించాయి. ప్రైవేటు కాంప్లెక్స్ల్లోని ఇనిస్టిట్యూట్లకు అవకాశం లేకపోగా ఎత్తేసుకున్నవారు ఉన్నారు. స్టూడెంట్లు లేకుండా, క్లాసులు నడవకుండా రెంట్లు కట్టడం దేనికని మూసివేయగా,  ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తామని చెప్పిన చేతులు ఎత్తేసిన సంస్థలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా నిర్వహణ భారానికి భయపడి మూసివేస్తుండడంతో ఇనిస్టిట్యూట్ల సంఖ్య తగ్గిపోతోంది.

Related Posts