YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సమ్మె.. ఎవరికి కష్టం.. ఎవరికి నష్టం

సమ్మె.. ఎవరికి కష్టం.. ఎవరికి నష్టం

విజయవాడ, జనవరి 22,
ఆంధ్రప్రదేశ్ లో పదమూడు లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు తాము సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం వీరి జీత భత్యాలకే ఖర్చవుతుంది. కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఫిట్ మెంట్ కారణంగా ప్రభుత్వంపై పదివేల కోట్ల అదనపు భారం పడుతుంది. అయినా ఉద్యోగుల్లో వేతన బాధలు చల్లారడం లేదు.రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో దాదాపు మూడున్నర కోట్ల మంది పేదలే. వారికి సంక్షేమ పథకాలను అందించడం కోసం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా వేతనాలు పెరుగుతాయి. నెల తిరిగేసరికి ఠంఛన్ గా జీతం వస్తుంది. కరోనాసమయంలోనూ వారికి జీతాల బాధ లేదు. ఆర్థిక బాధలు అసలే ఉండవు. ఉద్యోగ సంఘాల నేతల చేతి ఐదు వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలను, మణికట్టుకు ఉన్న బ్రేస్ లెట్లను చూస్తే వారి ఆర్థిక పరిస్థితి అర్థమవుతుంది. వేతనాలు సరిపోవడం లేదా? ఎందుకు వీరికి జీతభత్యాలను పెంచాలి? ఇప్పుడున్న జీవన ప్రమాణాలకు తగినట్లు వారి వేతనాలు లేవా? వేతనం సరిపోక అప్పుల పాలవుతున్నారా? ఆస్తులు పెంచుకుంటున్నారా? వేతనాలకు తోడు ఆమ్యామ్యాలు అదనమే అయినా అవి లెక్కల్లోకి రావు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరన్న విమర్శలున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే వారానికి ఐదు రోజులే పనిదినాలు. అది కూడా వేళకు రారు. వారు వచ్చినప్పుడే పని సమయం. వారికి ఉన్న భద్రత అలాంటిది. ప్రయివేటు కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగితో పోల్చుకుని చూస్తే వారికి అర్థమవుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి, అనుకూలత ఉన్నంత కాలం రాజకీయంగా ఉద్యోగులు ఏమీ చేయలేరన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి ఉద్యోగులు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో సమ్మెకు వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత రాదా. అసలే అవినీతి పరులుగా ముద్రపడిన(కొందరు) ఉద్యోగుల పట్ల సదభిప్రాయం ప్రజల్లో లేదు. సమ్మెకు వెళితే ప్రభుత్వం కన్నా ఉద్యోగులకే నష్టం. ఎన్నికల్లో తాము కీలకంగా మారతామని, ప్రభుత్వాన్ని మార్చేస్తామన్న ఉద్యోగ సంఘాల నేతల మాటలను ప్రభుత్వం ఎంత వరకూ పట్టించుకుంటుందో తెలియదు కాని అంత సీన్ లేదని అధికార పార్టీ చెబుతోంది. అయితే పదమూడు లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులతో ప్రభుత్వానికి నష్టమా? అన్నది రానున్న కాలంలో తెలియనుంది.

Related Posts