YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

700 కోట్లు లాభాలు దాటేసిన స్టీల్ ప్లాంట్...

700 కోట్లు లాభాలు దాటేసిన స్టీల్ ప్లాంట్...

విశాఖపట్టణం, జనవరి 24,
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరుపై తీవ్రం కానుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్‌ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. 150 మంది స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారన్నారు. వచ్చే నెల 12 తో నిరసన దీక్షలకు ఏడాది పూర్తవుతుందన్నారు. 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయ ముట్టడి, ఫిబ్రవరి 23న విశాఖ నగర బంద్‌తో పాటు రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.స్టీల్ ప్లాంట్‌ వెనుక 16,500 కుటుంబాల త్యాగం ఉందని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి మరో చైర్మన్‌ రాజశేఖర్‌ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఐతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం..లేదా తీసేస్తాం అంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట స్ఫూర్తి తెలియాలని ఉధృతంగా ఉద్యమిస్తామన్నారు. కరోనా సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించాం. దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనుకున్నారో ఆ పథకంతోనే బీజేపీ ఆరిపోవడం ఖాయమని మంత్రి రాజశేఖర్‌ అన్నారు.స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుని తీరుతామని వైసీఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు మస్తానప్ప స్పష్టం చేశారు. కేవలం 5వేల కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్లుకు కార్మికులు తీసుకుని వెళ్లారు. పెట్టుబడి దారుల పక్షణా బీజేపీ నిలిచినందుకు ఫిబ్రవరి 23, 24 దేశ వ్యాప్త సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి తీరుతామన్నారు.

Related Posts