YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అంబానీ స్థానంలో ఆదానీ

అంబానీ స్థానంలో ఆదానీ

ముంబై, జనవరి 27, భారతదేశంలో అత్యంత సంపన్నుడ ఎవరు అంటే దాదాపు అందరూ ముఖేష్ అంబానీఅని అంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఏళ్లుగా నెంబర్ వన్‌గా నిలుస్తూ వచ్చిన అంబానీ.. ఇప్పుడు డౌన్ ఫాల్ అయ్యారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో ప్లేస్‌కి వచ్చారు. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా నెట్‌వర్త్ జాబితాను ప్రకటించింది.కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్స్ పతనం కారణంగా.. రిలయన్స్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా ముఖేష్ అంబానీ సంపద క్షీణించింది. దాంతో ఆయన నెంబర్ 2కి పడిపోయారు. ఇదే సమయంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. దాంతో గౌతమ్ అదానీ నికర విలువ పెరిగింది. ఫలితంగా ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి.. గౌతమ్ అదానీ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద రూ. 6.72 లక్షల కోట్లు(90 బిలియన్ డాలర్లు) కాగా, ముఖేష్ అంబానీ సంపద రూ. 6.71 లక్షల కోట్లు (89.8 బిలియన్ డాలర్లు)గా ఉంది.
ఇక భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ముఖేష్ అంబానీ చాలా కాలం పాటు నిలిచారు. ఆయనతో పోటీ పడినవారే లేరు. కానీ, గత కొంతకాలంగా గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ గ్రూప్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తానికి ముఖేష్ అంబానీని బీట్ చేసి అదానీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యారు.

Related Posts