
రాచకొండ కమిసనరేటు హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిదిలో దంపతులు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హాయత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం లో ఉన్న శ్రీ సాయి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో దంపతులు ఇద్దరు ఒకే ఫ్యాన్ కి ఉరేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించిoది. గత కొన్ని నెలల క్రితం సాయి కుటీర్ లోని ఆరవ నెంబర్ ప్లాట్ ని గడ్డం సృజన్ రెడ్డి(38) అతని భార్య గడ్డం సారిక (35) లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి కుమారుడు పార్థు వున్నాడు. మృతుడు స్థానికంగా ఉన్న ఒక ఫంక్షన్ హాల్ ని లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. అంతే గత సంవత్సరం క్రితం సృజన రెడ్డి కి గుండెకి ఆపరేషన్ కావడం అనారోగ్యంతో భాదపడుతుండటం , ఆర్డిక ఇబ్బందులు,
బార్య భర్తల మధ్య గొడవలు కారణంగానే ఆత్మహత్య కి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లుగా పోలీపులు అంటున్నారు. మధ్యాహ్నం మృతుడు నడిపే ఫంక్షన్ హాల్ లో వాచ్ మెన్ గా పనిచేసే వ్యక్తికి ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ లో ఉన్న తాడుని కార్ లో పెట్టవలసిందిగా చెప్పాడు. సాయంత్రం నుండి వాచ్ మెన్ మృతునికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం తో నేరుగా ఇంటికివెళ్లి చూసాడు. ఫ్యాన్ కి ఉరేసుకున్నట్లు కనపడటం తో పోలీసులకు సమాచారం అందించాడు.