YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

పొస్టింగ్ నాకు బాథ అనిపించింది

 పొస్టింగ్ నాకు బాథ అనిపించింది

హైదరాబాద్, జనవరి 29,
న్యాచురల్ స్టార్ హీరో నాని  ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్ . డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి , మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది చివరిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. ఇందులో నాని, సాయి పల్లవి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి దేవదాసి పాత్రలో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి నటనకు.. ఆమె చేసిన నృత్యానికి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవదాసి వర్గానికి చెందిన మైత్రి అనే యువతిగా సాయి పల్లవి తన పాత్రలో జీవించింది. దక్షిణాది ప్రేక్షకుల నుంచి ఈ సినిమాపై ప్రశంసలు వెలువడ్డాయి.అయితే దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదు అంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఆరోపణలు వెలువడ్డాయి. ఒక టాలెంటెడ్ నటిని బాడి షేమింగ్ చేయడం దారుణమంటూ పలువురు ఆ కథానాన్ని ఖండించారు. ఇక తాజాగా ఇదే విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళి సై గవర్నర్ స్పందించారు. సాయి పల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. కోలివుడ్‏కు చెందిన ఓ ఛానల్‏తో మాట్లాడుతూ..తాను కూడా తన రూపం పట్ల ఎప్పుడూ ట్రోలింగ్‏కు గురయ్యాయని.. అలాంటి మాటలను తాను ఎంతో దైర్యంగా ఎదుర్కోన్నట్లుగా తెలిపారు. ” ఇలా ఎగతాళి వారికే తెలుస్తుందని… ఆ మాటలు ఎంత బాధత కలిగిస్తుందో.. నేను బాధపడ్డాను. కానీ నేను నా ప్రతిభతో, నా శ్రమతో, ఆ మాటలను ఎదుర్కొన్నాను. అలాంటి వాటి బారిన పడక8డా ఉండాలంటే మనం మహాత్ములం కాదు.. నేను వాటిని వదిలిపెట్టాను. కానీ ఆ ట్రోలింగ్ బాధిస్తుందా అని అడిగితే.. ఖచ్చితంగా అని ఒప్పుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు తమిళి సై సౌందర్య రాజన్.పొట్టిగా.. ముదురు రంగుతో.. నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. అందుకే కాకి తన పిల్లను బంగారు పిల్లగా భావిస్తుంది. కానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా అన్నారు తమిళి సై. స్త్రీలు ఎక్కువగా బాడీ షేమింగ్‏కు గురవుతారు. కానీ పురుషులు అలాంటి మాటలు ఎదుర్కోలేరు. పురుషులు 50 ఏళ్ల వయసులో ఉన్న యువకులుగా చూస్తారు.. కానీ స్త్రీలు అలా కాదు.. మహిళల ఎదుగుదలను ఆపలేని ఈ సమాజం వారిని బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.

Related Posts