YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సమ్మె అడుగులు...

సమ్మె అడుగులు...

గుంటూరు, జనవరి 31,
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమ్మె అనివార్యంగా కన్పిస్తుంది. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇక సమ్మె దిశగానే ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను తాము తీర్చామని ప్రభుత్వం వాదిస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా జీతాల్లో కోత పెట్టిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పీఆర్సీ పై విడుదల చేసిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. చర్చలకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.దీంతో ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు పట్టుదలకు పోతున్నట్లే కన్పిస్తుంది. సమ్మెకు ఇంకా ఎంతో సమయం లేదు. వచ్చే నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. ఈలోగా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుంతుందన్న నమ్మకం లేదు. ఉద్యోగులు మాత్రం సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం కూడా చూస్తుంటే సమ్మె జరిగితే ఏం చేయాలన్న దానిపై ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తుంది. ఎవరికి నష్టం? నిజానికి ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రభుత్వానికి నష్టం జరిగే మాట అటుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ డిమాండ్లను నెరవేర్చుకునే అవకాశాలు మాత్రం లేవు. వందల కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా లేదు. ఇప్పడు కాకపోతే ఇంకెప్పుడు? అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. గతంలోనూ సమ్మె చేసి తమ డిమాండ్లను నెరవేర్చకున్నామన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తొలిదశలో ఉద్యోగ సంఘాల నేతలు కొంత మెతక వైఖరిని అవలంబించినా ఉద్యోగుల నుంచి వచ్చిన వత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదు.కానీ ప్రభుత్వం మాత్రం సమ్మె పై సీరియస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎస్మా వంటి అస్త్రాలతో పాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కరోనా తీవ్రత, ఆర్థిక పరిస్థితి బాగా లేని సమయంలో ఉద్యోగులు సమ్మెకు దిగడం పై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ప్రభుత్వంతో పాటు ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ సమ్మెలను ఎవరూ హర్షించరన్న ధోరణితో ఉన్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు పట్టుదలతోనే ఉన్నాయి. ఇక సమ్మె అనివార్యమని ఇద్దరూ అభిప్రాయానికి వచ్చినట్లే కనపడుతుంది.

Related Posts