YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అమ్మకాల్లో టాటా

అమ్మకాల్లో టాటా

ముంబై, జనవరి 31,
దేశీయ కార్ల దిగ్గ‌జం టాటా అమ్మకాల్లో దూసుకుపోతున్న‌ది. డీజిల్‌, పెట్రోల్ కార్ల‌తో పాటుగా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కూడా టాటా కంపెనీ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. ఈవీ కార్ల‌కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా టాటా కంపెనీ మొద‌ట నెక్సాన్ పేరుతో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను ఉత్ప‌త్తి చేసింది. 30.2 కెడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీతో ఈ కార్లు న‌డుస్తున్నాయి. బ్యాట‌రీని ఒక‌సారి రీఛార్జ్ చేస్తు 312 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. డీసీ ఫాస్ట్ రీఛార్జ్ తో ఛార్జింగ్ చేస్తే గంట‌లో 80 శాతం వ‌ర‌కు ఛార్జ్ అవుతుంది. అదే రెగ్యుల‌ర్ హోమ్ చార్జ‌ర్ ద్వారా చార్జింగ్ చేస్తే 10 నుంచి 90శాతం ఛార్జింగ్ కావ‌డానికి 8 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, ఇప్ప‌టి వ‌ర‌కు 13500 టాటా నెక్సాన్ ఈవీ కార్ల‌ను అమ్మిన‌ట్టు టాటా కంపెనీ ప్ర‌క‌టించింది. టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్‌, ఎక్స్ఎమ్ ప్ల‌స్ వంటి మోడ‌ళ్ల‌లో అందుబాటులో ఉన్న‌ది. ఈ ప్యాసింజ‌ర్ వాహ‌నాలు అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌కు ల‌భిస్తుండ‌టంతో టాటా నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆస‌క్తి చూపుతున్నారు. త్వ‌ర‌లోనే టాటా నెక్సాన్ డార్క్ మోడ‌ల్‌ను లాంచ్ చేయ‌నున్న‌ది.

Related Posts