YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఒక్క రోజు 1200 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం

ఒక్క రోజు 1200 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం

హైదరాబాద్, ఫబ్రవరి 1,
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.ఉత్తర్వుల ప్రకారం 50 శాతం వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెరిగింది. ఖాళీ స్థలాల విలువ 35 శాతం, ప్లాట్ల విలువ 25 శాతం పెంపుతో పాటు పెరిగిన విలువకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయనున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలలో విలువ పెంపు.. పెరిగిన విలువ ప్రకారం సబ్ రిజిస్టర్ సాఫ్ట్వేర్ లో రిజిస్ట్రేషన్ శాఖ మార్పులు చేసింది. రాష్ట్రంలో తొలిసారి ఖాళీ స్థలం చదరపు గజం ధర లక్ష దాటింది. దీంతో పాటు ప్లాట్ చదరపు అడుగు విలువ 9 వేలు దాటింది. మార్కెట్ విలువలు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రిజిస్ట్రేషన్ ద్వారా జనవరి లోనే ప్రభుత్వానికి 1200 కోట్ల ఆదాయం రావడం విశేషం.
కరీంనగర్ లో భారీ పెంపు
ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువ
ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ పట్టణంలోని మార్కెట్‌ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీ లతో ఆ శాఖ ఖజానా లో కోట్లాది రూపాయలు జమకానున్నాయి.వ్యవసాయేతర భూములు చదరపు గజానికి మార్కెట్ విలువ ప్రకారం
కరీంనగర్ జిల్లా:-
పాతవిలువ 32,500
కొత్త విలువ 43,900
పెద్దపల్లి జిల్లా
పాత విలువ 28,750
కొత్త విలువ 38,900
జగిత్యాల జిల్లా
పాత విలువ 21,500
కొత్త విలువ 29,100
రాజన్న సిరిసిల్ల జిల్లా
పాత విలువ 13,000
కొత్త విలువ 17,600

Related Posts