YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కొవిడ్ పరీక్షల్లో తప్పుడు నివేదికలు

కొవిడ్ పరీక్షల్లో తప్పుడు నివేదికలు

నిజామాబాద్, ఫిబ్రవరి 2, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒక్క రోజే రెండు రకాల ఫలితాలు రావడంతో పురిటి నొప్పులతో గర్భిణి అవస్థ పడింది. ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటే నెటెటీవ్‌ వచ్చింది. ఆ రిపోర్టుతో ప్రయివేటు ఆస్పత్రిలో ప్రసవానికి వెళ్తే అక్కడ టెస్టులు చేసి కోవిడ్‌ పాజిటివ్‌ అని ఇచ్చారు. ఒక్క రోజే రెండు రకాల ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తే 'మాకు సంబంధం లేదు.. మా టెస్టుల్లో పాజిటీవ్‌ వచ్చింది కాబట్టి మేము చికిత్స చేయబోం' అని ప్రయివేటు ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. ఈ క్రమంలో సమయానికి చికిత్స అందక గర్భిణికి రక్తపోటు తీవ్రమై ఇబ్బందులు పడింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదు. చివరకు కలెక్టర్‌ జోక్యంతో బాధితురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ప్రయివేటు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కవిత.. హైదరాబాద్‌ రోడ్డులోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కవిత భర్తకు కరోనా వచ్చి తగ్గింది. మూడు రోజుల కిందటే నెగెటివ్‌ తేలింది. గైనకాలజిస్టు సూచన మేరకు పది రోజుల కిందట ప్రయివేటు ఆస్పత్రికి ఆమె ప్రసవానికి వెళ్లింది. అక్కడ కోవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టు నిర్వహించగా.. పాజిటివ్‌ తేలింది. ఎలాంటి లక్షణాలూ లేకున్నా పాజిటివ్‌ అని చెప్పి వైద్యం చేయడానికి నిరాకరించారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు అవసరమైన స్కానింగ్‌లు, రక్త పరీక్షలు నిర్వహించి డెలివరీకి ఇంకా సమయం ఉందని చెప్పి ఇంటికి పంపించారు. పురిటి నొప్పులు మొదలైనట్టు అనిపించడంతో కవితకు ముందుగా ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. దాంతో కవితను తీసుకుని భర్త ప్రయివేటు ఆస్పత్రికి డెలివరీ కోసం వెళ్లారు. కానీ అక్కడ ప్రయివేటు ల్యాబ్‌లో మళ్లీ ర్యాపిడ్‌ టెస్టు చేసి పాజిటివ్‌ అని చెప్పడం గమనార్హం. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 'ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయమే టెస్టు చేయిస్తే నెగెటీవ్‌ వచ్చింది. మీరేంటి పాజిటివ్‌ అంటున్నారు' అంటూ ప్రశ్నించగా..తమ టెస్టుల్లో మాత్రం పాజిటివ్‌ వచ్చిందని,డెలివరీ చేయబోమని తెగేసి చెప్పారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ సుదర్శనం దృష్టికి తీసుకెళ్లారు.కానీ ఫోన్‌ చేసినా స్పందించలేదు. చివరకు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా..కలెక్టర్‌ నారాయ ణరెడ్డి జోక్యం చేసుకుని గర్భిణీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ విషయం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రయివేటు ఆస్పత్రిలో సమయానికి చికిత్స నిరాకరిం చడంతో గర్భిణీకి రక్తపోటు ఎక్కువైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉంచారు.

Related Posts