YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా పెరుగుతున్న హోమ్ ఫుడ్స్

భారీగా పెరుగుతున్న హోమ్ ఫుడ్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 3,
కరోనా మొదలైనప్పటి నుంచి జనాల్లో క్వాలిటీ ఫుడ్ తినేందుకే ఇంట్రెస్ట్ పెట్టారు.  హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం కన్నా  ఇంటి ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ఇస్తున్నారు. దీంతో జంక్ ఫుడ్కు బదులు ఇంటి ఫుడ్బండ్లు ఏర్పాటు చేసుకుని చాలామంది బిజినెస్గా చేసుకుంటున్నారు.  స్నాక్స్, పచ్చళ్లు, కూరలు ఇలాంటి ఫుడ్ను ఇంట్లో తయారు చేయడానికి వీలుండగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు హోం మేడ్ ఫుడ్ వ్యాపారులు  పొందుతున్నారు.  కరోనా తర్వాత జాబ్స్ కోల్పోయిన చాలామంది  చిన్న  వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో హోం మేడ్ ఫుడ్బిజినెస్కు మంచి గిరాకీ ఉంది. గ్రామాల నుంచి సిటీకి వచ్చి చదువుకునే, ఉద్యోగాలు చేసుకునేవారు హోమ్ ఫుడ్ ని ఇష్టపడుతుండగా రోడ్లపై హోంమేడ్ఫుడ్స్టోర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. రెండువేల రూపాయల లోపు పెట్టుబడితో ముడిసరుకులు కొని పిండి, కారం పొడులు, మసాలా పొడులు, స్నాక్స్, పచ్చళ్లు తయారు చేస్తున్నారు. వాటిని రోడ్ సైడ్ చిన్న టేబుల్ వేసుకుని అమ్మడం, చిన్న ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి రోడ్ సైడ్ ఆపి సేల్ చేస్తున్నారు.టిఫిన్ టైంలో ఇంట్లో పిండి తయారు చేసుకోవడం ఇబ్బందే. బయట మార్కెట్ లో రెడీమెడ్ అందుబాటులో ఉన్నా చాలామంది తీసుకునేందుకు ఇష్టపడరు.  అదే ఆలోచన వచ్చింది.  ఇంట్లోనే తయారు చేసుకుని అమ్ముతున్నాం. జనాలు కొనేందుకు ముందుకు వస్తున్నారు. దోశ, ఇడ్లి పిండితో పాటు అందులోకి కావల్సిన పొడులు కూడా చేస్తున్నాం. పొడులు క్వాంటిటీని బట్టి ఇస్తున్నాం. ప్రస్తుతం బిజినెస్బాగానే ఉంది.ఐదు నెలల నుంచి పచ్చళ్లు, స్నాక్స్ బిజినెస్ చేస్తున్నాం. బయట మార్కెట్ లో కంటే తక్కువ ధరకే అమ్ముతున్నాం.  ఒకేసారి నాలుగైదు కిలోలు చేసి పెట్టి, ప్యాక్ చేస్తాం. చిన్న ట్రాలీ ఆటోలో సాయంత్రం తీసుకెళ్లి పెడతాం. ఇండ్లకు వెళ్లే వాళ్లు  కొనుక్కుంటున్నారు.
–  మధుసూదన్, చిరువ్యాపారి, షేక్‌పేట్

Related Posts