YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సర్కారీ స్కూళ్లలో అపరిశుభత్ర..

సర్కారీ స్కూళ్లలో అపరిశుభత్ర..

నిజామాబాద్, ఫిబ్రవరి 3,
ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. బడుల్లో స్వీపర్లు, అటెండర్లను ఎత్తివేయడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని, ఆ బాధ్యత స్థానిక సంస్థలదేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. ఒక్కో గ్రామంలో పంచాయతీ సిబ్బంది తక్కువగా ఉండటం, రోజువారీ విధులకే సమయం చాలకపోవడంతో ఫిర్యాదు చేస్తేనే.. వారానికోసారి పారిశుద్ధ్య కార్మికులను పంపించి పాఠశాలను క్లీన్ చేయిస్తున్నారు.సర్కారు బడుల పరిశుభ్రత బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించారు. చిన్న గ్రామ పంచాయతీల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మాత్రం చాలా ఘోరంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉండటంతో అసలు సమస్య వచ్చి పడుతోంది. ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి క్లీన్ చేయడం కష్టంగా మారింది. వాస్తవానికి గ్రామాల్లోనే చాలా వీధుల్లో రోజువారీగా శుభ్రం చేయడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ శుభ్రం చేసేందుకు వీలు కావడం లేదని గ్రామాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి.గ్రామాల్లో నిర్వహిస్తున్న పచ్చదనం, పరిశుభ్రత ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను, స్టోర్‌ రూంలను తరగతి గదులను, పాఠశాలల ఆవరణను స్వచ్ఛ పాఠశాలలో భాగంగా పరి శుభ్రంగా ఉంచాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ తరుఫున వారం రోజుల పాటు స్వచ్ఛ పాఠశాల పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించారు. అయితే అది కొంత మేరకు మాత్రమే పరిమితమైంది. వారం రోజుల పాటు గ్రామంలోని స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం కేవలం ప్రకటనకే పరిమితమైందిప్రతి పాఠశాలలో మరుగుదొడ్లతో పాటుగా పాఠశాల ఆవరణ, గదులు శుభ్రం చేయాలంటే కనీసం రెండు గంటలకుపైగా పడుతోంది. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచే ముందుగా వీధుల్లో శుభ్రం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కాలనీవాసుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో శుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత పాఠశాలలకు వెళ్లే సమయానికి అప్పటికే క్లాసులు మొదలవుతున్నాయి. దీంతో శుభ్రత కష్టంగా మారుతోంది. అయితే ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి శుభ్రం చేయలేమంటూ పారిశుద్ధ్య కార్మికులు బహిరంగంగానే చెప్పుతున్నారు. దీంతో వారానికోసారి వెళ్తున్నా.. చాలా పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయి. పాఠశాల గదులన్నీ దుమ్ముతో నిండుతున్నాయి. అంతేకాకుండా క్లీనింగ్ చేసేందుకు వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులు కేవలం పాఠశాల ఆవరణను ఊడ్చి వెళ్తున్నారు. దీంతో తరగతి గదులు అపరిశుభ్రతతో ఉంటున్నాయి. అటు మరుగుదొడ్లు కూడా క్లీన్ చేయకపోవడంతో చాలా పాఠశాలల్లో వాటిని వినియోగించడం లేదనే ఫిర్యాదులున్నాయిఅయితే గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్, అటెండర్లు ఉండటంతో ఉదయం నుంచే శుభ్రం చేశారు. కానీ కొన్నేండ్ల నుంచి వారిని భర్తీ చేయడం లేదు. ఇప్పుడు వాటిని స్థానిక సంస్థలకు అప్పగించడంతో ఇక భర్తీ చేసే అవకాశం కూడా లేదు. కనీసం స్వచ్ఛ కార్మికుడినైనా నియమించాలంటూ ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ శాఖకు మొర పెట్టుకుంటున్నారు. కానీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.

Related Posts