YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మినిమం టైం స్కేల్ అమలు చేయాలి

మినిమం టైం స్కేల్ అమలు చేయాలి

విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నామమాత్రపు జీతాలు పెంచి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్రప్రభుత్వ అవుట్ సౌర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఎసి ఆరోపిస్తోంది. జీవో నెంబర్ 7 ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించి నామమాత్రపు జీతాలు నిర్ణయించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ మనీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో సమాన పనికి సమాన వేతనం, దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన మాట తప్పారని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల పీఆర్సీని పది సంవత్సరాలకు పెంచి అదే జీతాలతో పదేళ్లు పనిచేయాలని ప్రభుత్వం చెప్పడాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నరు. గతంలో జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 5 ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Posts