YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

గేటు వాయిదాకు సుప్రీంకోర్టు నో

గేటు  వాయిదాకు సుప్రీంకోర్టు నో

న్యూఢిల్లీ ఫిబ్రవరి 3
గ్రాడ్యుయేట్ అప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేటు )ని వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగితే విద్యార్థుల్లో అనిశ్చితి, ఆందోళనకు దారి తీస్తుందని పేర్కొంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్స్‌పై విద్యార్థులకుగల సమగ్ర అవగాహనను పరీక్షించేందుకు గేటు ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ కంపెనీల్లో నియామకాలకు కూడా ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడంతో గేటు పరీక్షలు ముందుగా ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరుగుతాయి. గేటు -2022ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను ఆదేశించాలని 11 మంది గేటు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related Posts