YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ పోస్టర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్  పోస్టర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 4,
టాలీవుడ్‌ తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ వేయికళ్లతో ఆసక్తిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ , యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఓలివియో మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెత్‌ ఓ రూపొందిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ కారణంగా మరొకసారి వెనక్కు తగ్గింది. ఆతర్వాత కొన్ని రోజులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా ఈ రెండు రోజులు కాకుండా సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ జక్కన్న బృందం సినిమా కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది. ఇందులో రామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ గుర్రంపై స్వారీ చేస్తుండగా.. అతని వెనకే ఎన్టీఆర్ బైక్ పై వెళుతున్నాడు. సినిమాకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయినట్లు రీలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ అన్ని భాషల్లోనూ 150 మిలియన్ల వ్యూస్‌ ను క్రాస్ చేయడం విశేషం.

Related Posts