YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమమైనింగ్ అడ్డుకున్న ధూళిపాళ్ల

అక్రమమైనింగ్ అడ్డుకున్న ధూళిపాళ్ల

గుంటూరు, ఫిబ్రవరి 10
అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీల దగ్గర ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్‌పై అధికారులు స్పందించాలంటూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సుద్దపల్లి క్వారీల దగ్గర ధూళిపాళ్ల  బైఠాయించారు. ఆయనకు మద్దతుగా టీడీపీ శ్రేణులు సైతం తరలివచ్చారు. ఈ క్రమంలో సుద్దపల్లి క్వారీల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుద్దపల్లి క్వారీ గుంతల వద్ద ధూళిపాళ్ల చేపట్టిన దీక్ష వద్దకు వచ్చిన మైనింగ్ అధికారులు రాత్రి చేరుకున్నారు. తహాశీల్దార్ ఎన్ఓసి ఇవ్వడం వల్లే మైనింగ్‌కు అనుమతి ఇచ్చామని అధికారులు ధూళిపాళ్లకు తెలిపారు. అయితే.. అధికారుల తీరుతో రాత్రంతా క్వారీలలోనే దీక్ష కొనసాగిస్తున్నాని ధూళిపాళ్ల అక్కడే బైఠాయించారు.  మైనింగ్ ఏడి వచ్చి అక్రమ మైనింగ్‌పై కొలతలు తీయాలని.. అప్పటివరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని ధూళిపాళ్ల పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పనిలో అక్రమాలు జరుగుతున్నాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. సుద్దపల్లి క్వారీలలో కూడా నాడు – నేడు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైపీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అక్రమ మైనింగ్ జరిగిందో లెక్క తేల్చాలన్నారు. ఈ క్రమంలో ధూళిపాళ్ల ఆందోళన చేస్తున్న సుద్దపల్లి క్వారీ వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆందోళన విరమించకుంటే అరెస్టు చేసే అవకాశముందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుద్దపల్లి క్వారీల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related Posts