YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

5 రూపాయిలకు పడిపోయిన టమోటా

5 రూపాయిలకు పడిపోయిన టమోటా

బెంగళూర్, ఫిబ్రవరి 10,
అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో వచ్చింది. వి.కోట మండలం మూడు రాష్ట్రాల కూడలిలో ఉంది.ఇటు బెంగళూరు… అటు చెన్నై మరోవైపు హైదరాబాద్ ఉండడంతో పెద్ద ఎత్తున వ్యాపారులు ఇక్కడకు వచ్చి విక్రయాలు సాగిస్తారు. ప్రస్తుతం రోజూ దాదాపు 200 టన్నులకు పైగా సరుకు వస్తున్నా… ధర మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల కిలో 150 వరకు టమాటా పలికింది. అయితే ఇప్పుడు ఆరేటు కాస్తా ఐదు రూపాయలకంటే దిగువకు పడిపోయింది.తెచ్చిన పంటను అమ్మినా… కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు రైతులు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పన కోసం ఈ-ఫామ్‌ మార్కెట్‌ పేరిట నాణ్యమైన పంటను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ప్రస్తుతం టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పశ్చిమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

Related Posts