YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

హెల్త్ కు కార్పొరేషన్....

హెల్త్ కు కార్పొరేషన్....

హైదరాబాద్, ఫిబ్రవరి 11,
రాష్ట్రంలో హెల్త్కార్పొరేషన్ఏర్పాటుకు కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. దీని ద్వారా హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రదిపాదనలూ సిద్ధమయ్యాయి. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేగాక కొత్త ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌ల నుంచి లోన్లు కూడా తీసుకోవాలనుకుంటున్నారు. వైద్యశాఖ ఇచ్చిన నివేదికలు ప్రకారం ప్రభుత్వం అధ్యయనం కూడా చేస్తున్నది. సాధ్యసాధ్యలపై అంచనా వేస్తూ పూర్తి స్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. అతి త్వరలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని కేబినేట్ముందు పెట్టనున్నారు. ఆ తర్వాత ఈ విధానానికి అనుమతి ఇచ్చే ఛాన్స్ఉన్నదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక నుంచి కార్పొరేషన్ కేంద్రంగానే ఆసుపత్రుల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నిర్మాణాల ప్రతిపాదనలు వంటి కార్యకలాపాలను కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త ప్రాజెక్టులకు నిధులు కొరత ఉన్నట్లు వైద్యాధికారులు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖాన్ల నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఒక్కో మెడికల్ కాలేజీ కి సుమారు రూ. 520 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన 8 మెడికల్ కాలేజీలకు 4,160 కోట్ల అవసరం ఉన్నది. దీంతో పాటు వరంగల్ హెల్త్ సిటీకి మరో రూ. 1100 కోట్లు, టిమ్స్ నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీకి మరో రూ. 4 వేల కోట్లు అవసరం ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ చెబుతున్నది. ఇప్పటికిప్పుడు ఈ డబ్బును సమకూర్చడం ప్రభుత్వానికి అదనపు భారంగా మారుతున్నది. పైగా ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒకట్రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఎలక్షన్లలో లబ్ధి పొందాలని యోచిస్తోంది.కానీ, రెండేండ్లలో ఈస్థాయిలో డబ్బులు హెల్త్ కోసమే ఖర్చు చేసే సత్తా ప్రస్తుతం ప్రభుత్వ ఖజనాకు లేనందున కార్పొరేషన్‌ ఆలోచనను తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో మిషన్ భగిరథ తరహాలో హెల్త్‌లోనూ కార్పొరేషన్ఏర్పాటు చేసి సుమారు రూ.10 నుంచి 15 వేల కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక వేళ కార్పొరేషన్ఏర్పాటుకు కేబినేట్అంగీకరించని యెడల ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖాన్లు నిర్మాణాలు ముందుగు సాగడం కష్టమని స్వయంగా ఆఫీసర్లే చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీఎస్ఎంఎస్ఐడీసీ ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉండటం వలన లోన్లు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం.

Related Posts