YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

తెలంగాణలో రీడ్ కార్యక్రమం....

తెలంగాణలో రీడ్ కార్యక్రమం....

అదిలాబాద్, ఫిబ్రవరి 12,
తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో పఠన (రీడ్‌- చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు) కార్యక్రమం నిర్మల్‌ జిల్లాలో నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశా రు. వంద రోజుల పాటు ఒకటి నుంచి 8వ తరగతుల వరకు ఈ కార్యక్రమం అమ లు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1050 పాఠశాలల్లో 1,13,616 మంది విద్యార్థుల్లో పఠన సామ ర్థ్యం మెరుగు పర్చడానికి ప్రణాళిక రూపొందించనున్నారు. విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి, విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి, భాషా నైపుణ్యం పెంచడానికి ఈ ‘రీడ్‌’ కార్యక్రమం ఉపయోగపడనున్నది.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ప్రత్యేకంగా ఓ పీరియడ్‌ను కేటాయిస్తారు. పాఠశాలల్లోని పుస్తకాలన్నీ వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శిస్తారు. తరగతుల వారీగా విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా చూస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14 నుంచి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించి అందులో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చూడాలి. కార్యక్రమ నిర్వహణకు పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, పోషకులు, విద్యావేత్తలు, ఎన్జీవోల భాగస్వామ్యం తీసుకొని విద్యార్థులు ఇంటి వద్ద చదవడానికి ప్రోత్సహించాలి. పూర్వ ప్రాథమిక నుంచి 2వ తరగతి వరకు గ్రూపు- 1గాను, 3 నుంచి 5వ తరగతి వరకు గ్రూ పు-2గాను, 6 నుంచి 8వ తరగతి వరకు గ్రూపు-3గా పరిగణించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.జిల్లాలోని 1050 పాఠశాలల్లో 1,13,616 మంది విద్యార్థుల్లో ‘రీడ్‌’ ప్రోగ్రాం ద్వారా పఠన సామర్థ్యాన్ని ఈ వంద రోజుల్లో పెంపొందించనున్నారు. 695 మండల పరిషత్‌ పాఠశాలల్లో 48,984 మంది విద్యార్థులు, 35 ప్రభుత్వ పాఠశాలల్లో 3535 మంది విద్యార్థులు, 5 డీఎన్‌టీ పాఠశాలల్లో 175 మంది విద్యార్థులు, 18 కేజీబీవీల్లో 2,891 మంది విద్యార్థినులతో పాటు తెలంగాణ మోడల్‌ పాఠశాలలో 386 మంది విద్యార్థులు, అర్బ న్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 26 మంది, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 254 మంది, టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలల్లో 399 మంది, 43 ఈడబ్ల్యూ ప్రా థమిక పాఠశాలల్లో 433 మంది, మినీ గురుకులం లో 103 మంది, 17 టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలల్లో 3030 మంది విద్యార్థులు, టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈఐ పాఠశాలల్లో 393 మంది విద్యార్థులు, 208ప్రైవేటు ఆన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 47,171 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరిలో వంద రోజుల్లో పఠన సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు.రీడ్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఎంతైనా ఉంది. వంద రోజుల్లో ప్రతి విద్యార్థి ఏ పుస్తకాన్నయి నా చదివేలా ప్రోత్సహించాల్సి బాధ్యత ఉపాధ్యాయులదే. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలను మానిటరింగ్‌ చేస్తూ విజయవంతం చేయాలి.

Related Posts