YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్ టూ విశాఖ సినీ పరిశ్రమ.. దారెటు...

హైదరాబాద్ టూ విశాఖ సినీ పరిశ్రమ.. దారెటు...

హైదరాబాద్, ఫిబ్రవరి 14,
సినిమా పరిశ్రమను విశాఖపట్నానికి ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం అక్కడ స్టూడియోల నిర్మాణం, షూటింగుల కోసం భూసేకరణకు అప్పుడే ప్ర‌య‌త్నాలు ప్రారంభించేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా భూ నిధిని ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు తెలుస్తోంది. సినీ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులకు కూడా భూములు కేటాయించాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయించిందని అంటున్నారు.అయితే.. సినీ ప‌రిశ్ర‌మ ఏపీకి వ‌స్తుందో రాదో తెలీదు కానీ.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా దివాళా తీసిన ఏపీ పరిస్థితిని చూసిన పారిశ్రామికవేత్తలు మాత్రం ఒక్కొక్కరుగా హైదరాబాద్ తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితికి తోడు వైసీపీ సర్కార్ చేతకాని తనం, జగన్ రెడ్డి మొండి వైఖరితో విసిగిపోయిన పారిశ్రామికవేత్తలు వలసబాట పట్టారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే 6 లక్షల 20 కోట్ల అప్పుల్లో ముంచేసిన వైసీపీ సర్కార్ ఏ ఒక్క పరిశ్రమకూ కనీస సౌకర్యాలు, రాయితీలు కూడా కల్పించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించే దుస్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి రాజధాని నగరం లేకుండా చేయడమే కాకుండా.. కనీస వసతి రహదారులు కూడా లేని దుస్థితికి ఏపీని తీసుకెళ్లింది వైసీపీ సర్కార్. ఒక పక్కన సౌకర్యాలు ఉండవు, మరో పక్కన రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆపైన ఎవరైతే నాకేంటి అనే మొండివైఖరి.. ముడుపులు ముట్టనిదే ఏ పనీ జరగని దుస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లోనే పారిశ్రామికవేత్తలు పక్కరాష్ట్రానికి దారి వెతుక్కునేలా చేశాయనే విమర్శలు వస్తున్నాయి.నిజానికి రోజువారీ కార్యక్రమాల కోసం కూడా అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి ఏపీని జగన్ సర్కార్ నెట్టేసిందని అంటున్నారు. రాజధానిని నిర్మించరు, రోడ్లు వేయరు. విద్యుత్ కొరత సమస్య వచ్చి పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ, తిరుపతి, రాజమండ్రిల్లో సినీ పరిశ్రమ కోసం భూములు కేటాయిస్తామంటూ జగన్ సర్కార్ ముందుకు రావడం వెనుక పెద్ద స్కెచ్ ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా స్టూడియోల కోసం ఇచ్చిన భూముల పరిసరాల్లో రియల్ ఎస్టేట్ దందా చేసి, భారీగా కాసులు దండుకోవాలనే కుతంత్రం ఏదో ఈ నిర్ణయం వెనుక ఉందని అంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటవుతుందని అనేక మంది పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు పెట్టుబడులతో గతంలో ముందుకు వచ్చారు. అయితే.. రాజధాని పరిస్థితి అయోమయంగా మారడంతో వారంతా మనసు మార్చుకుని, ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారంటున్నారు. వైసీపీ సర్కార్ అనాలోచిత విధానాలతో ఖజానా ఖాళీ అయిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలతో పెట్టుకున్నారు. అభివృద్ధి జాడ కంచు కాగడా పెట్టి వెదికినా కనిపించడం లేదు. పైపెచ్చు వంది మాగధులు, అస్మదీయులకు నామినేటెడ్ పోస్టుల పేరిట కోట్లాది రూపాయలు దోచిపెడుతున్న వైనం. చివరికి ఏపీ ఇంతలో ఆర్థికంగా కోలుకునే పరిస్థితి ఏ కోశానా కనిపించడం లేదని అంటున్నారు. అసలు సంగతి అలా ఉంచి.. వడ్డీలు కూడా కట్టలేనంతగా దిగజారిపోయిన ఏపీని ఎవరు గట్టెక్కిస్తారో.. ఎలా గాడిలో పెడతారో అని ప్రజలు ఆశగా చూస్తున్నారు.

Related Posts