YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

స్టూడెంట్స్ ఫుల్... టీచర్లు నిల్

 స్టూడెంట్స్ ఫుల్... టీచర్లు నిల్

నల్గొండ, ఫిబ్రవరి 14,
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్ధుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది.కరోనా కారణంగా ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎంతో మంది పేరెంట్స్, తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అయితే స్కూళ్లల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సరిపడ లేక విద్యార్ధులకు క్లాసులు అంతంత మాత్రమే సాగుతాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు సరిగా రాకపోవడంతో, కొన్ని ప్రభుత్వ స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం అటకెక్కింది. స్కూళ్లలో టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు, టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారు.నల్గొండ జిల్లాలో మొత్తం 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, లక్షా ఆరు వేల 878 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 979 స్కూల్స్ ఉండగా 64 వేల 882 మంది విద్యార్థులు చదువుతున్నారు. యాదాద్రి జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 53 వేల 989 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2 వేల 822 మంది స్కావెంజర్లు పని చేసేవారు. అయితే కరోన మహమ్మారి ప్రబలిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించింది. ఇబ్బందులు తలెత్తకుండా స్కూళ్లల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటి లకు అప్పగించినా పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు. అత్యధిక చోట్ల టీచర్లే విరాళాలు వేసుకొని ప్రైవేట్ వ్యక్తులను నియమించి పనులు చేయిస్తున్నారు.2020 మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు అడపాదడపా తొమ్మిది నెలలు పని చేశాయి. స్కూళ్ల ను ప్రారంభించిన రోజు మొక్కుబడిగా స్థానిక సంస్థల కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టి, తరువాత ముఖం చాటేడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంది. కొన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత కారణంగా.. ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను సరిపడా నియమించాలని కోరుతున్నారు. సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్య ను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts