
ఒడిస్సా రాష్ట్రంలో ఒకే రోజు రెండు ఘటనలలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళ మావోయిస్టులు ఉన్నారు. కంధమాల్ జిల్లాలో సుధుకంప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలికపడ గ్రామ సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు చనిపోయారు. వారి వద్ద నుంచి ఏకె 47 తో పాటు ఇన్సాఫ్ రిఫైల్ దొరికింది. బలంగిరి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. మొత్తం 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.