YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేక హత్య కేసు.. 40 కోట్ల డీల్

వివేక హత్య కేసు.. 40 కోట్ల డీల్

కడప, ఫిబ్రవరి 15,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. సీబీఐ ఛార్జిషీట్‌లో వివేకా హత్యకు గల కారణాలపై కీలక అంశాలను పేర్కొన్నారు. ఆయన హత్య కేసులో సంచలన విషయాలను ఛార్జిషీట్‌ ద్వారా కోర్టుకు సమర్పించింది. సెటిల్‌మెంట్‌ల్లో విబేధాల వల్లే వైఎస్‌ వివేకా హత్య జరిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది సీబీఐ. గత ఏడాది అక్టోబరు 26న పులివెందుల కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది సీబీఐ. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను ప్రధానంగా పేర్కొందివివేకా హత్య జరిగిన రోజు ఆధారాలు లేకుండా చేయడంలో పలువురు ప్రముఖుల పాత్ర ఉందని ప్రస్తావించింది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనల మేరకే బెడ్ రూం, బాత్ రూంలను పని మనుషులు శుభ్రం చేశారని పేర్కొంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వివేకాకు ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. బెంగళూరులో 8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ వ్యవహారంలో వివేకాకు, ఎర్ర గంగిరెడ్డికి మధ్య విబేధాలు వచ్చాయని, వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు స్పష్టం చేసింది.

Related Posts