YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చెడ్డి గ్యాంగ్ సభ్యుడు అరెస్టు

చెడ్డి గ్యాంగ్ సభ్యుడు అరెస్టు

తిరుపతి
చెడ్డి గ్యాంగ్ లోని ఒక నేరస్తుడ్ని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి పట్టణంలో ఈ మద్య కాలములో చెడ్డీ గ్యాంగ్ రాత్రి సమయాలలో కొన్ని  దొంగతనలు చేసిన విషయం తెలిసిందే. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ ఎస్.డి.పి.ఓ మురళి కృష్ణ  ఆద్వర్యంలో,ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసారు. తిరుచానూరు   ఎస్.ఐ రామకృష్ణ రెడ్డి,  సిబ్బంది చెడ్డీ గ్యాంగ్ సభ్యుడు  మదీయ భాయ్ కమజి భాయ్ మేద ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు ఈ చెడ్డీ గ్యాంగ్ లోని మరో ఇద్దరు సభ్యులు కంలేష్ బబురియ ఉరఫ్ కంలేశ్ ఉరఫ్ కంలా, సక్ర మందొడ్ లను ఇది వరకే రిమాండ్ కి పంపారు.. ఈ చెడ్డీ గ్యాంగ్ తిరుపతి లోనే కాకుండా ఏపీ, తెలంగాణ,  కర్నాటక రాష్ట్రాలలోఅనేక నేరాలకు పాల్పడింది.

Related Posts